పడక గదిలో సమస్యా? ఈ లోపం కావొచ్చు.. ఓసారి చూడండి!
మనిషి జీవితంలో ఆహారానికి ఎంత ప్రాధాన్యం ఉందో.. శృంగారానికీ అంత ప్రాముఖ్యత ఉంది. ఇది అత్యంత సహజమైన అంశం. ప్రతి జీవికీ ఎంతో సాధారణమైన ఈ విషయం.. మనిషి దగ్గరికి వచ్చేసరికి చాలా కాంప్లికేటెడ్ అవుతూ ఉంటుంది. దీనికి సమాజంలోని కట్టుబాట్లు ఒకెత్తయితే.. అవగాహనాలోపం, అజ్ఞానం మరో ఎత్తు. ఈ కారణంగానే.. తమకు ఎదురయ్యే లైంగిక సమస్యలను ఎవరితోనూ చెప్పుకోలేని వారు కొందరైతే.. అసలు ఆ సమస్యేంటో గుర్తించలేని వారు చాలా మంది!
అంగస్తంభన..
ఉరుకుల పరుగుల జీవితంలో ప్రతీ ఒక్కరు ఎదుర్కొంటున్న సమస్య స్ట్రెస్. ఈ ఒత్తిడి రానురానూ మరింతగా పెరిగి, అది ఆరోగ్యం మీద, అటు తర్వాత శృంగారం మీదా పడుతోంది. ఇది ఎంత తీవ్రమైన సమస్యగా ఉందంటే.. ప్రతీ ఐదుగురిలో ఒకరు ఈ సమస్యతో బాధపడుతున్నారు. గతంలో 50 సంవత్సరాలకు దగ్గర్లో ఉన్నవారికి ఈ సమస్యలు ఎదురైతే.. ఇప్పుడు వయసుతో సంబంధం లేకుండా ఈ సమస్య తలెత్తుతుండడం ఆలోచించాల్సిన విషయం.
ప్రధాన సమస్యగా..
అంగస్తంభన సమస్య అనేది శృంగార జీవితాన్ని ఆస్వాదించకుండా అడ్డు పడుతుంది. దీంతో.. వారు భాగస్వామితో సరిగా పార్టిసిపేట్ చేయలేరు. ఎప్పుడో ఒకప్పుడు ఇలా జరిగే పర్వాలేదుగానీ.. తరచూ ఈ సమస్య కొనసాగి మాత్రం ఇబ్బందికరమే. ఇది కంటిన్యూ అయితే.. తమలో శక్తి తగ్గిపోయిందని, ఏదో సమస్య తమను చుట్టుముట్టిందని పురుషులు మరింతగా నీరుగారిపోతారు.
కారణమేంటీ..?
ఈ సమస్యకు చాలా కారణాలు ఉంటాయి. కొన్నిరకాల మందులు వినియోగించడంతోపాటు పొగతాగడం, మద్యం అతిగా సేవించడం, డ్రగ్స్ తీసుకోవడం వంటి దురలవాట్లు ప్రధాన కారణాలు అవుతాయి. అయితే.. తమలో సమస్య మొదలు కాగానే ఆందోళనకు గురయ్యే పరుషులు.. దాన్ని త్వరగా పరిష్కరించుకోవాలని ఆరాటంలో తెలిసీ తెలియని దారిలో వెళ్తున్నారు. దీంతో.. తమ సమస్యకు పూర్తిస్థాయిలో పరిష్కారం కనుగొనలేకపోతున్నారు.
ఆరోగ్యమే శృంగార భాగ్యం..
ఆకలి వేస్తోంది కాబట్టి తినాలి. ఏదో ఒకటి కడుపులో వేసేస్తే సరి. అన్నట్టుగానే భోజనం చేస్తుంటారు చాలా మంది. కానీ.. మనం తినేది పొట్ట నిండడానికే కాదు.. అది ఆరోగ్యాన్ని కూడా అందించాలి. అప్పుడే అంగస్తంభన సమస్యలు కూడా దరిచేరవు. ఇటీవల కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం జరిపిన పరిశోధనలో ఈ విషయం మరోసారి రుజువైంది.
నిరూపించిన మరో పరిశోధన..
1986 నుంచి 2014 మధ్య ప్రతీ నాలుగు సంవత్సరాలకు ఒకసారి నమూనాలను పరిశీలించిన శాస్త్రవేత్తలు మేలైన డైట్‌తోనే శృంగార జీవితం బాగుంటుందని తేల్చారు. అది కూడా 'మెడిటేరియన్ డైట్' కి దగ్గరగా ఉండే తిండి తిన్నవాళ్లు పడక గదిలో రెచ్చిపోతారని తేల్చారు. ఈ డైట్ తీసుకునే వారిలో అంగస్తంభన సమస్యలు తలెత్తే ఛాన్స్ చాలా తక్కువని తేలింది.
ఆ డైట్ లో ఏముంటాయి?
మెడిటేరియన్ డైట్ లో ఖరీదైనవి, అరుదుగా దొరికేవి లాంటి పదార్థాలు ఏవీ ఉండవు. అన్నీ మనకు అందుబాటులో ఉండేవే ఉంటాయి. ఈ డైట్ లో ప్రధానమైనవి కూరగాయలు, పండ్లు, మూలికలు, కాయలు, బీన్స్, తృణధాన్యాలు ఉంటాయి. వీటిలోని తాజా ప్రొటీన్స్, హెల్దీ కొలెస్ట్రాల్ ఆరోగ్యానికి, తద్వారా అంగస్తంభనకు ఎంతో మేలు చేస్తాయి. కాబట్టి, అంగస్తంభన సమస్యతో బాధపడుతున్న వారు.. తమ ఆహారంలో ఈ పదార్థాలు ఉండేలా చూసుకోవాలి. దాన్నికన్నా ముందుగా అనవసర బిడియాన్ని వదిలి.. సమస్య పరిష్కారం కోసం వైద్యుడి వద్దకు కదలాలి. తద్వారా సమస్యను శాశ్వతంగా పరిష్కరించుకొని, తమ దాంపత్య జీవితాన్ని సంతోషంగా గడిపే అవకాశం ఉంటుంది.