కాంగ్రెస్ కొత్త ఫేస్ ప్రియాంక.. పీకే మార్క్ స్కెచ్...?
ఆయన ఎన్నికల వ్యూహకర్త. తెర వెనక ఉంటారు. ఆయన జనాల మదిలో ఏముందో అంజనం వేసి అంచనా కట్టి మరీ దానికి తగినట్లుగా గెలుపు గుర్రాలను పరుగులు తీయిస్తారు. నిజానికి విదేశాల్లో ఎన్నికల వ్యూహకర్తలకు చాలా ఏళ్ళుగా డిమాండ్ ఉంది. భారత దేశంలో రెండు దశాబ్దాలుగా అలాంటి ఎన్నికల వ్యూహాలను మార్కెటింగ్ చేస్తూ జాతీయ రాజకీయాలను మరో మలుపు తిప్పిన ఘనత ప్రశాంత్ కిశోర్ దే.
ఆయన ఇన్నాళ్ళూ తెర వెనక పోషించిన దర్శక పాత్ర నుంచి ఇపుడు తెర ముందు నాయక పాత్రలోకి వచ్చేస్తున్నారు. దేశానికి కీలకమైన పార్టీగా జాతీయ స్థాయిలో ఈ రోజుకూ ఉన్న కాంగ్రెస్ ను బలోపేతం చేయడం ద్వారా ఒకనాటి తన మిత్రుడు మోదీని దెబ్బతీయాలని చూస్తున్నారు. సరే పీకే వ్యూహాలు ఆయనకు ఉన్నాయి. ఆయన పలుకుబడి కూడా చాలానే ఉంది.
ఇపుడు ఆయన ప్రాంతీయ పార్టీల రెక్కలతో కాంగ్రెస్ ని కేంద్రంలో మరోమారు చక్రం తిప్పే పాత్రలోకి పంపించి అధికార పీఠాన్ని అందుకోవడానికి భారీ స్కెచ్ గీస్తున్నారు. ఈ మొత్తం వ్యవహారంలో కలసివచ్చే పార్టీలు కాంగ్రెస్ కి ఎటూ ఉన్నాయి. తమిళనాడులో డీఎంకే అధినేత స్టాలిన్ ఎటూ యూపీయే మిత్రుడే. ఇక శరద్ పవార్ కూడా కాంగ్రెస్ తోనే ఉంటారు. ఇపుడు ఆయన చేయాల్సింది కొత్త మిత్రులను సమకూర్చడం.
అలా పశ్చిమ బెంగాల్ లో మమతా బెనర్జీని, తెలంగాణాలో కేసీయార్ ని ఏపీలో జగన్ని కూడా కలుపుకుంటే కాంగ్రెస్ కి అందలం దక్కినట్లే అని ఆలోచిస్తున్నారు. అదే విధంగా ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ క్రేజ్ ని కూడా సొమ్ము చేసుకుని హస్తానికి నేస్తం అయ్యేలా చూడాలనుకుంటున్నారు.
ఈ పనిలో ఆయన బిజీగా ఉంటూనే మరో వైపు కాంగ్రెస్ కి కొత్త ఫేస్ ని వెతికిపెట్టే పనిలో ఉన్నారు. గత రెండు ఎన్నికలూ కాంగ్రెస్ తరఫున రాహుల్ గాంధీ ప్రధాని అభ్యర్ధిగా జరిగాయి. ఈసారి మాత్రం రాహుల్ ఫేస్ ని మార్చి ప్రియాంక ముఖాన్ని భారత రాజకీయ తెరకు పరిచయం చేయాలన్నదే పీకే వ్యూహం అని అంటున్నారు. ప్రియాంకకు ఉన్న ప్లస్ పాయింట్స్ ఏంటి అంటే సులువుగా పార్టీ జనాలతో పాటు బయట జనాలతో సహా అందరితో కలసిపోవడం.
అదే విధంగా నాన్నమ్మ ఇందిరాగాంధీను పోలికలు అచ్చు గుద్దినట్లుగా ఉండడం. ఇక దేశంలోని ఓటర్లకు ఆమె ఫ్రెష్ ఫేస్ గా ఉండడం. అదే విధంగా మిత్ర పక్షాలతో కూడా ఆమె కలసిపోయే వారు కావడం. ఆమె వెనక ఎటూ ప్రశాంత్ కిశోర్ ఉంటారు కాబట్టి మిగిలిన రాజకీయ వ్యూహాలన్నీ ఆమె తెలుసుకుంటారు. అయితే ప్రియాంకకు ఒక్కటే ఆటంకం ఉంది.
అది కూడా తల్లి సోనియాగాంధీ నుంచే ఉంది. ఆమెకు రాహుల్ గాంధీని ప్రధానిగా చేయడమే ఇష్టం. కానీ కాంగ్రెస్ కి కొత్త ముఖాలు అన్నీ కావాలని వ్యూహాలు పన్నుతున్న పీకే మాత్రం ప్రియాంకే ది బెస్ట్ అని అంటున్నారు. ఆమెను ముందు పెట్టి దేశమంతా తిప్పితేనే వర్కౌట్ అవుతుంది అని ఆలోచిస్తున్నారు. ఇక ప్రియాంక అయితే వైసీపీ అధినేత జగన్ లాంటి వారు కూడా ఓకే అంటారని కూడా చెబుతున్నారు. అలాగే కేసీయార్, మమతా బెనర్జీలకు కూడా ఆమె అంటే సానుకూలత ఉంది.
ఇలా టోటల్ గా చూస్తే ప్రియాంకను ప్రధానిగా చేయాలని పీకే తహతహలాడుతున్నారు. ఆయన కనుక సోనియాను ఒప్పిస్తే మాత్రం దేశానికి కొత్త ప్రధానిగా, ఇందిరమ్మ తరువాత మహిళా ప్రధానిగా 2024లో ప్రియాంక వచ్చినా ఆశ్చర్యం లేదు అనే అంటున్నారు. చూడాలి మరి పీకే మార్క్ వ్యూహం ఎలా ఫలిస్తుందో ఏంటో.