మద్యం మత్తులో వధువుపై వరుడి స్నేహితుల పని.. ఆగిన పెళ్లి

Update: 2020-12-15 03:45 GMT
ఈరోజుల్లో పెళ్లి అంటే సంబురం.. పెళ్లి అనగానే ఎక్కడలేని ఊపు వస్తుంది. వధువు, వరుడు కూడా స్టెప్పులేస్తూ హల్ చల్ చేస్తున్నారు. ఓ పండుగలా జరుపుకుంటున్నారు. కానీ ఇక్కడ ఆ అతి కాస్త ఎక్కువై ఓ పెళ్లి ఆగిపోయింది.

మద్యం మత్తులో స్నేహితులు చేసిన పనికి ఓ వ్యక్తి పెళ్లి పీటల వరకు వచ్చి ఆగిపోయిన వైనం ఉత్తరప్రదేశ్ లో చోటుచేసుకుంది. వరుడి స్నేహితులు డ్యాన్స్ చేయాలంటూ వధువును బలవంతం పెట్టడంతో పెళ్లి ఆపేశారు ఆమె కుటుంబ సభ్యులు.. ఉత్తరప్రదేశ్ లోని బరేలీలో ఈ ఘటన చోటుచేసుకుంది.

కనౌజ్‌ జిల్లాకు చెందిన ఓ యువతికి బరేలీకి చెందిన యువకుడితో కొద్దినెలల క్రితం పెళ్లి నిశ్చయమైంది. శుక్రవారం పెళ్లి రోజు కావటంతో మేలతాళాలతో పెళ్లికూతురు తరుపు వారు బరేలిలోని పెళ్లి కుమారుడి ఇంటికి చేరుకున్నారు. మరికొద్ది నిమిషాల్లో తాళి కట్టే తరుణం ఆసన్నమవుతుందనగా.. పెళ్లి కుమారుడి స్నేహితులు పెళ్లి కూతుర్ని డ్యాన్స్‌ చేయాలంటూ బలవంతంగా డ్యాన్స్‌ చేసే వేదికపైకి లాక్కెళ్లారు. దీనిపై పెళ్లి కుమార్తె  కుటుంబం అభ్యంతరం తెలిపింది. ఇరువర్గాల మధ్య గొడవకు దారితీసింది. పోలీసులు రంగంలోకి దిగారు.

ఈ క్రమంలోనే పెళ్లి కుమారుడి కుటుంబంపై పెళ్లి కూతురు కుటుంబం ఫిర్యాదు చేసింది.  అదనపు కట్నం కింద కేసు పెట్టారు. చివరకు 6.5 లక్షలు ఎదురు ఇచ్చి పెళ్లి రద్దు చేసుకున్నారు. ఇలా మద్యం మత్తులో వరుడు స్నేహితులు చేసిన పనికి ఓ పెళ్లియే ఆగిపోయిన వైనం యూపీలో చోటుచేసుకుంది.
Tags:    

Similar News