పాపం ట్రంప్​.. హెలిక్యాప్టర్​ అమ్మేస్తున్నాడట! ధర తెలిస్తే షాక్​ అవుతారు.

Update: 2020-11-09 09:10 GMT
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఓడిపోయిన ట్రంప్​ త్వరలోనే వైట్​హౌస్​ను వదిలిపెట్టి వెళ్లబోతున్నారు. అమెరికా అధ్యక్షుడిగా రాజభోగాలు అనుభవించిన డోనాల్డ్ ట్రంప్ ఎన్నికల్లో  బైడెన్​ గెలుపుతో ట్రంప్​ ఇక ఓ సాధారణ వ్యక్తిగా మారబోతున్నారు. ఎలక్షన్​ రిజల్ట్స్​తో ట్రంప్​ జీవితం ఒక్కసారిగా తలకిందులైంది. నిజానికి ట్రంప్​ మొదటి నుంచి చాలా విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు. అమెరికా అధ్యక్షుడు కాకముందు కూడా అతడో పెద్దపారిశ్రామిక వేత్త. అందువల్ల చాలా రిచ్​ లైఫ్​ లీడ్​ చేసేవారు.  అతడి దగ్గర ఎన్నో ప్రైవేట్ జెట్స్, హెలికాప్టర్స్ ఉన్నాయి. ఇటీవలి ఎన్నికల సందర్భంగా ట్రంప్​ బోయింగ్​ 757 విమానాన్ని వినియోగించారు.

అయితే ట్రంప్​ ఇప్పుడు తన దగ్గర ఉన్న ఓ విలాసవంతమైన హెలికాప్టర్​ను అమ్మకానికి పెట్టినట్టు సమాచారం. దాని ధర భారత కరెన్సీ ప్రకారం రూ. 24 కోట్లు ఉన్నట్టు సమాచారం. ఈ మేరకు అమెరికా మీడియాలో వార్తలు వచ్చాయి. ట్రంప్​ ఈ హెలికాప్టర్​లో కూర్చున్న పలు ఫొటోలు ఇప్పుడు సోషల్​మీడియాలో వైరల్​గా మారాయి. ఈ హెలికాప్టర్​ను ట్రంప్​ ఎంతో ప్రత్యేకంగా డిజైన్​ చేయించుకున్నారు. అందులో ఆయన కూర్చొనేందుకు ఓ ప్రత్యేకమైన అమరిక ఉంది. విలాసవంతమైన సీట్లు ఉన్నాయి. ఈ హెలిక్యాప్టర్​ సుమారు 6,259 గంటల ప్రయాణాన్ని పూర్తి చేసింది. ట్రంప్ ప్రత్యేక లోగో హెలికాప్టర్ తోకపై కూడా ఉంటుంది. ట్రంప్ పరిస్థితి చూసి అంతా అయ్యో పాపం అంటున్నారు.
Tags:    

Similar News