రాష్ట్రపతి నిర్ణయం వచ్చేసింది..నిర్భయ దోషులకు క్షమాభిక్షకు నో

Update: 2020-01-17 08:41 GMT
నిర్భయ దోషులకు ఈ నెల 22 ఉదయం ఏడు గంటలకు ఉరిశిక్ష అమలవుతుందా? అన్న అంశంపై పెద్ద ఎత్తున కన్ఫ్యూజన్ నెలకొంది. ఉరి వాయిదా పడనుందన్న మాట పలువురి నోట వినిపిస్తోంది. అయితే.. ఈ అంశంపై తాజాగా ఒక క్లారిటీ వచ్చేసింది. నిర్భయను అతి పాశవికంగా గ్యాంగ్ రేప్ చేసి.. ఆమె మరణానికి కారణమైన దోషలకు ఇప్పటికే మరణించే వరకూ ఉరిశిక్షను అమలు చేయాలని కోర్టు తీర్పును ఇచ్చింది. వారికి ఉరిశిక్ష విదించేందుకు ఏర్పాట్లు సాగుతున్నాయి.

ఇలాంటివేళ.. వినయ్ శర్మ.. ముఖేశ్ సింగులు దాఖలు చేసిన క్యూరేటివ్ పిటిషన్లను సుప్రీం కొట్టి వేసింది. అనంతరం వారికున్న ఏకైన ఆప్షన్ అయిన రాష్ట్రపతికి క్షమాభిక్ష పిటిషన్ పెట్టుకున్నారు. దీన్ని తిరస్కరిస్తూ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ తాజా గా నిర్ణయం తీసుకున్నారు. దీంతో వారికి ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈ నెల 22న వారికి ఉరిశిక్షను అమలు చేసే అవకాశమే ఎక్కువగా ఉందంటున్నారు.

నిర్భయ దోషులకు విధించిన ఉరిని అమలు కాకుండా ఆపేందుకు ఆఖరి అవకాశంగా ఉన్న క్షమాభిక్ష పిటిషన్ ను దేశ ప్రధమ పౌరుడికి అందజేశారు. ప్రోటోకాల్ ప్రకారం.. తొలుత దోషి క్షమాభిక్ష పిటిషన్ ఢిల్లీ ప్రభుత్వానికి పంపారు. ఆ పిటిషన్ ను తిరస్కరించాలని ఢిల్లీలోని ఆప్ ప్రభుత్వం నిర్ణయించింది. అదే విషయాన్ని అక్కడి లెఫ్టెనెంట్ గవర్నర్ కు విన్నవించారు. దీంతో.. ఆయన క్షమాభిక్షను వ్యతిరేకించారు. ఇదే సమయంలో దోషుల క్షమాభిక్ష పిటిషన్ ను రాష్ట్రపతికి పంపగా..  ఆయన ఆ పిటిషన్ ను రిజెక్టు చేస్తూ సుప్రీం రిజెక్టు చేసింది. ఈ నేపథ్యంలో ముందే అనుకున్నట్లుగా ముందుగా నిర్ణయించిన దాని ప్రకారమే ఉరిశిక్ష అమలు చేసే వీలుంది. ఇదిలా ఉంటే.. తీహార్ జైల్లో ఖైదీల్ని ఉంచే జైలు నుంచి ఉరితీసే ముందు మార్చే మూడో నెంబరు జైలుకు ఖైదీల్ని తరలించారు. అంటే.. ఉరి ఖాయమనే మాట వినిపిస్తోంది.


Tags:    

Similar News