హవ్వా.. గాలి వల్ల గర్భం దాల్చిందంట?

Update: 2021-02-18 03:30 GMT
సాధారణంగా ఒక అమ్మాయికి కడుపు చేయాలంటే ఎలా సాధ్యం.. కేవలం మగాడితోనే సాధ్యమంటారా? ఈ భూమ్మీద అలానే సాధ్యం. మహిళలు పురుషుల వల్లే గర్భం దాల్చుతారు. కానీ ఈమెకు గాలి వల్ల గర్భం వచ్చిందంట.. చూడడానికే వింతగా ఉన్నా ఇది నిజంగా నిజం..

గాలి వల్లే తాను గర్భం దాల్చానని.. గంటలోనే బిడ్డకు జన్మనిచ్చానని ఇండోనేషియాలో ఓ మహిళ చెప్పడం వైరల్ గా మారింది. సోషల్ మీడియా ఇప్పుడు దీనిపైనే చర్చ జరుగుతోంది. గాలి వల్లే గర్భం రావడం ఏంట్రా బాబూ అని ఆరాతీస్తున్నారు.

నేను నిద్రిస్తున్న సమయంలో కిటికీ నుంచి వీచిన గాలి  నా జననేంద్రియంలోకి ప్రవేశించిందని.. 15 నిమిషాల తర్వాత కడుపులో నొప్పి వచ్చిందని సదురు మహిళ వివరించింది.కడుపు పెద్దగా మారిందని.. ఆస్పత్రికి వెళితే గర్భం దాల్చానని డాక్టర్లు చెప్పారని మహిళ వివరించింది. ఆ తర్వాత క్షణాల్లోనే బిడ్డకు జన్మనిచ్చాను అని ఆమె చెప్పడం అందరినీ సంభ్రమాశ్చర్యాలకు గురిచేస్తోంది.
Tags:    

Similar News