పిచ్చి పీక్స్​ కి..రక్తం మడుగు లో ప్రీ వెడ్డింగ్​ షూట్​!

Update: 2020-11-13 07:50 GMT
ప్రస్తుతం పెళ్లిల్లు అంటే ప్రీ వెడ్డింగ్​ షూట్​ లు చేయడం కామన్​ గా మారిపోయింది. అయితే ఇది ముదిరి పిచ్చి పట్టినట్లు కొందరు వ్యవహరిస్తున్నారు.ఇటీవలే ఓ జంట నదిలో ప్రీ వెడ్డింగ్​ షూట్​ తీసుకోబోయి ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. గుట్టల్లో, అడవుల్లో సముద్రతీరాల్లో ఫొటో షూట్​, వీడియో షూట్​ తీసుకున్న పలువురు ఇబ్బందులు పడ్డారు. అయితే తాజాగా ఓ జంట మరీ క్రియేటివ్​గా ఆలోచించింది. అందరిలాగా రొటీన్​గా ఉండొద్దని భావించిన ఈ జంట.. ఎవరో తమపై దాడి జరిపినట్లు కనిపించే విధంగా, ముఖానికి రక్తం అంటినట్లుండే మేకప్‌ తో తమ వెడ్డింగ్‌ షూట్‌ చేయించుకున్నారు.

 ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్​ మీడియా లో వైరల్​ గా మారాయి. వాటిని చూసిన ప్రతి ఒక్కరూ నిజంగానే ఏదో ప్రమాదం జరిగిందనే అని భ్రమపడేలా షూట్​ చేశారు. అయితే ఈ ప్రీ వెడ్డింగ్​ షూట్​ పై సోషల్​ మీడియాలో మిశ్రమ స్పందన వస్తున్నది. చాలా డిఫరెంట్​గా ఉందంటూ కొందరు కామెంట్​ చేస్తుంటే.. పిచ్చి పీక్స్ కు చేరుకుందని.. మరీ ఇంత క్రియేటివిటీ అవసరమా అంటూ మరి కొందరు కామెంట్లు పెడుతున్నారు. చూడటానికే బీతావహంగా ఉందని.. అయినా శుభమా అని పెళ్లి చేసుకుని ఈ రకమైన ఫొటోల గోల ఏంటని కడిగేస్తున్నారు.

ఏది ఏమైనా ఇటీవల ప్రీ వెడ్డింగ్​ షూట్​ ల ట్రెండ్​ నడుస్తున్నది. కొత్త దనం కోసమంటూ యువత కొన్ని వెర్రివేషాలు వేస్తున్నారు. సముద్రతీరాలు, గుట్టలు, నదుల్లో షూటింగ్​ చేస్తూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. కొంతమంది తల తిక్క ఈవెంట్​ మేనేజర్లు ఇటువంటి పిచ్చి సలహాలు ఇస్తూ యువతను ప్రమాదాల్లోకి నెట్టేస్తున్నారన్న వాదనా ఉన్నది. ఇది  ఏదో ట్రెండీ గా ఉందని వారు చెప్పే మాటలు విని యువ జంటలు పిచ్చి పనులు చేస్తూ విమర్శలు కొని తెచ్చుకుంటున్నారు.
Tags:    

Similar News