ఆ రూ.15 లక్షలు ఏవి - 2 కోట్ల ఉద్యోగాలు ఏమైపోయాయ్ - నల్లధనం ఎక్కడ..మోడీ పై ప్రకాష్ రాజ్ సెటైర్లు!
బీజేపీ దేశంలో తిరుగులేని పార్టీగా కొనసాగుతుంది. ఎక్కడ , ఏ ఎన్నికలు జరిగినా కూడా తమ ఆధిపత్యం చూపిస్తూ బీజేపీ ఇంకా బలంగా మారుతుంది. తాజాగా బీహర్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి ఘన విజయం సాధించింది. బీహార్ లో బీజేపీకి ఎక్కువ సీట్లు రావడం విశేషం. అయితే దీనిపై ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్ స్పందించారు. తనదైన శైలిలో బీజేపీ , ప్రధాని నరేంద్ర మోడీపై విరుచుకుపడ్డారు. గత కొన్నాళ్లుగా కేంద్ర ప్రభుత్వ వైఖరిపై మండిపడుతున్న సంగతి తెలిసిందే.
ఇందులో భాగంగానే మోడీ ఇచ్చిన హామీల అమలు కోసం ప్రజలు కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నారని, పేదల బ్యాంకు ఖాతాలో రూ.15 లక్షల నగదు జమ చేస్తామని చెప్పిన మాట ఏమైందని , ఆ డబ్బు ఎందుకు వేయడం లేదు.. హామీని విస్మరించారా అని నిలదీశారు. యువతకు ఉపాధి కల్పన ఏమయ్యిందని అడిగారు. ఏడాదికి రెండు కోట్ల మందికి ఉద్యోగం కల్పిస్తామని చెప్పలేదా అని ప్రశ్నించారు. అలాగే ఇతర దేశాల్లో దాచిన నల్లధనాన్ని వెలికితీస్తానని చెప్పిన మాటలు ఏమైపోయాయని అన్నారు.
ఆర్థిక వ్యవస్థ లక్ష్యం 5 ట్రిలియన్ అంటూ ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చారు. మరీ ఆచరణలో ఎందుకు విఫలమవుతోందని అడిగారు. మాంద్యం నుంచి ఎందుకు గట్టెక్కలేకపోతున్నామని వివరించాలని కోరారు. ఇప్పుడు ఎన్నికలకు ముందు కరోనా వ్యాక్సిన్ ఉచితంగా అందజేస్తామని తెలిపారు. మీ మాటల గారడీతో మోసం చేస్తున్నారు.. చేస్తూనే ఉన్నారని ధ్వజమెత్తారు. బీజేపీ/ మోడీ చెబుతోన్న మాటలను దేశం వింటోంది. ప్రజలకు వారిపై విశ్వాసం మరింత పెరుగుతోంది. వారిని అధికంగా ప్రేమిస్తున్నారు. అందుకే కాబోలు ఓటు కూడా వేస్తున్నారు అని ప్రకాశ్ రాజ్ సెటైర్ల వర్షం కురిపించారు. తప్పు ఎక్కడ ఉందో గుర్తించాలని కోరారు. దేశాన్ని నయం చేయాల్సిన అవసరం ఉంది అంటూ జస్ట్ ఆస్కింగ్ అంటూ ఫేస్ బుక్ లో పోస్ట్ చేశారు.