టీడీపీ నుంచి ఈ మద్దతు బతికున్నపుడు లేదే?

Update: 2019-09-16 14:15 GMT
ఏపీలో కొంతకాలంగా కోడెల కుటుంబం హాట్ టాపిక్. ఆ కుటుంబం పై అనేక కేసులు నమోదయ్యాయి. తన పాదయాత్రలో జగన్ సత్తెనపల్లి లో పర్యటించినపుడు కోడెల కుటుంబం కె-ట్యాక్స్ వసూలు చేస్తుంది అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే... తెలుగుదేశం పార్టీ అధికారం కోల్పోయాక జనమే స్వయంగా కోడెల కుటుంబం పై వరుసగా కేసులు పెట్టడంతో అవి ఆరోపణలు కాదు, నిజమే అన్నట్టు జనం భావించారు. ఇదిలా ఉండగా... కోడెల కుటుంబం పై నమోదయిన కేసులపై పలువురు వైసీపీ నేతలు స్పందిస్తూ  ప్రజలను ఇంతగా వేధించాలా అన్నట్టు విమర్శలు చేశారు. జనం కేసులు, ఇతర పార్టీల విమర్శలు తదితర నేపథ్యంలో ఏనాడూ టీడీపీ నుంచి కోడెలకు మద్దతు దక్కలేదు.

జనమే కేసులు పెడుతున్నపుడు మనం స్పందిస్తే పార్టీకి ఇంకా డ్యామేజ్ జరుగుతుందన్న స్వార్థంతో చంద్రబాబుతో పాటు టీడీపీ నేతలు ఎవరూ కోడెల తరఫున మాట్లాడలేదు. కానీ ఇపుడు ఆయన మరణాన్ని మాత్రం వాడుకుని రాజకీయ లాభం పొందుదామని ప్రయత్నం చేస్తున్నారు. తరచూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే కేశినేని నాని, వర్ల రామయ్య తదితర నేతలతో పాటు పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు కూడా ఇది వైసీపీ పార్టీ హత్య అంటూ ఆరోపణలు చేశారు. ఒకపుడు పార్టీ నుంచి బయటకు పంపేయాలని అనుకున్న వారు ఈరోజు కోడెల మరణాన్ని తమ రాజకీయానికి వాడుకోవడం ఏంటని సాధారణ జనం ప్రశ్నిస్తున్నారు.

ఎవరి నైనా పార్టీ కోసం వాడుకుని వదిలేయడమే గాని తిరిగి వారికి అవసరమైనపుడు అండగా ఉన్నట్లు చంద్రబాబు గురించి ఏ ఉదాహరణలు చరిత్రలో కనిపించవు. అందుకే ప్రతిపక్షంలో ఉన్నపుడు జగన్ ఉన్నంత ధీమాగా... సీనియర్, అనుభవజ్జుడు అని చంద్రబాబు ప్రతిపక్షంలో ధీమాగా ఉండలేకపోతున్నారు. నిజంగా కోడెలపై ఇదే ప్రేమ ఆయన బతికి ఉన్నపుడు చూపి పార్టీ తరఫున అండగా ఉంటే బాగుండేదని,  కోడెలపై ఆరోపణలు వచ్చినపుడు ఒక మర్యాదపూర్వక కలయిక బాబు - కోడెల మధ్య ఎందుకు లేదు అన్న వాదన వినిపిస్తోంది. ఇపుడు పుంఖానుపుంఖాలుగా ప్రగాడ సానుభూతి తెలిపితే ఏం ఉపయోగం అని అంటున్నారు.
Tags:    

Similar News