పేకాట స్థావరంపై పోలీసుల దాడి.. అరెస్ట్ అయిన నలుగురు మహిళలు

Update: 2020-10-31 23:30 GMT
పేకాట, పబ్బులంటే మగాళ్లు చెవి కోసుకుంటారు. పట్టణాల్లో ఉండేవారైతే వీటికి తరుచుగా వెళుతుంటారు. అయితే మగాళ్లకే ఈ సౌకర్యాలా..? తాము కూడా ఇందులో తీసిపోమని మహిళా మణులు నిరూపించారు.

తాజాగా హైదరాబాద్ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసులు సోదాలు నిర్వహించారు. పక్కా సమాచారంతో ఒక ఇంటిలో నిర్వహిస్తున్న పేకాట స్థావరంపై దాడి చేశారు.

ఇందులో చూస్తే పోలీసులే ఆశ్చర్యపోయిన పరిస్థితి. ఈ పేకాట స్థావరంలో పెద్ద బిజినెస్ మ్యాన్ లు చిక్కడం విశేషం. పోలీసులు అరెస్ట్ చేసిన వారిలో నలుగురు మహిళలు కూడా ఉండడం చూసి పోలీసులే ముక్కన వేలేసుకున్నారు. వీరందరినీ అదుపులోకి తీసుకొని జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ కు తీసుకొచ్చారు.

అరెస్ట్ వారిలో 4 మహిళలు, ఏడుగురు పురుషులు ఉన్నారు. ఇందులో అంబర్ పేటకు చెందిన కొంతమంది బిజినెస్ మ్యాన్స్ కూడా ఉండడం గమనార్హం. వీరి నుంచి సెల్ ఫోన్లు , 3.45 లక్షల నగదు కూడా స్వాధీనం చేసుకున్నారు.

గుట్టు చప్పుడు కాకుండా వెంకటగిరిలోని ఒక నివాసంలో పేకాట స్థావరాన్ని మహిళలే ఏర్పాటు చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. దీనిపై విచారణ జరుగుతోంది.
Tags:    

Similar News