మోడీ విడుదల చేసిన సినిమా ట్రైలర్!

Update: 2016-07-23 07:28 GMT
సినిమా ఆడియో విడుదల ఫంక్షన్స్ కు రాజకీయ నాయకులు రావడం - వారి చేతుల మీదుగా ఆ పాటలు విడుదలవడం సర్వసాదారణంగా చూస్తుంటాం. కాకపోతే.. అవి ఎక్కువగా రాష్ట్ర స్థాయి నేతలతోనే జరుగుతుంటాయి. బాలకృష్ణ సినిమాలకు సంబందించి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు రావడం - గతంలో శ్రీనివాస రెడ్డి దర్శకత్వం వహించిన కుబేరులు సినిమా ఆడియోను రాజశేఖర్ రెడ్డి విడుదల చేయడం వంటివి కొన్ని ఉదాహరణలు. అయితే తాజాగా భారత ప్రధాన మంత్రి నరేంద్రమోడీ కూడా ఒక సినిమాకు సంబందించిన ట్రయిలర్ ను విడుదల చేయడం సంచలనమైంది.

దేశ ప్రధాని నరేంద్రమోడీ మొట్టమొదటి సారిగా "22 జూలై 1947" అనే కన్నడ చిత్ర ట్రయిలర్‌ ను విడుదల చేశారు. దేశంపై ప్రేమ - గౌరవాలకు సంబంధించిన సందేశాత్మక చిత్రమైన చెబుతున్న ఈ సినిమా ట్రైలర్ ను మోడీ తన కార్యాలయంలో విడుదల చేశారు. దీంతో ఈ సినిమాకు సంబందించిన చర్చలు దేశవ్యాప్తంగా మొదలయ్యాయనే చెప్పాలి. కన్నడ బాషలో రూపొందిన ఈ చిత్రం తమిళ - తెలుగు తదితర బాషల్లో డబ్ చేయబడి త్వరలో విడుదలవుతుందని చిత్రయూనిట్ చెబుతుంది.
Tags:    

Similar News