కన్ఫ్యూషన్ లో పీకే, నాగబాబు..చెరొక దారి !

Update: 2020-06-13 06:30 GMT
ఏపీలో రాజకీయం ఒక్కసారిగా ఊపందుకుంది. ESI స్కామ్ లో టీడీపీ మాజీ మంత్రి అచ్చెన్నాయుడు ను ఏసీబీ అరెస్ట్ చేయడంతో రాష్ట్రంలో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. దీనిపై ప్రభుత్వం , ప్రతిపక్షం మధ్య మాటల యుద్ధం నడుస్తుంది. చట్టం తనపని తాను చేసుకుపోతుంది అని వైసీపీ నేతలు అంటుంటే ...ఇది ముమ్మాటికీ కక్ష సాధింపు చర్యలే అని టీడీపీ నేతలు ప్రభుత్వం పై విమర్శలు కురిపిస్తున్నారు. అయితే, ఈ సమయంలో జనసేన నేతలు ఒకే మాటపై లేకపోవడం ...ఎవరికీ ఇష్టం వచ్చినట్టు వారు మాట్లాడుతుండటం పై జన సైనికులు అసహనం లో ఉన్నారు.

గత ఎన్నికల్లో ఘోర పరాభవాన్ని చవి చూసినప్పటికీ కూడా  పార్టీలో ఏ మార్పు రావడంలేదు అని వారు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దీనికి కారణం లేకపోలేదు. ఒకవైపు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ..బీజేపీ మద్దతుగా మాట్లాడుతూ ..వైసీపీ ప్రభుత్వం పై విమర్శలు కురిపిస్తుంటే ...మరోవైపు మెగా బ్రదర్ నాగబాబు గత కొన్ని రోజులుగా వైసీపీ మద్దతుగా మాట్లాడుతూ ..టీడీపీ పై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు.

బాలయ్య వివాదంతో తెలుగుదేశం పార్టీపై పోరు మొదలుపెట్టిన నాగబాబు తర్వాత బాలకృష్ణను వదిలేసినా టీడీపీ వదల్లేదు. మొన్నటివరకు జనసేన అధికారంలోకి వస్తుంది అని చెప్తూ వచ్చిన నాగబాబు జనసేన గెలుస్తుందో లేదో తెలియదు గాని టీడీపీ మాత్రం గెలవదు అని ఆయన పదేపదే చెప్తున్నారు. తాజాగా అచ్చెన్నాయుడు అరెస్టు పై జనసేన ఒక ప్రకటన విడుదల చేసింది. అవినీతి చేసిన వారిని అరెస్టు చేయడంలో తప్పు లేదు. కానీ, కక్ష సాధింపుకోసం కాదని మీ చిత్తశుద్ధిని నిరూపించుకోండి. ఒక శాసనసభ్యుడిని అరెస్టు చేసే ముందు రాజ్యాంగ నిబంధనలు పాటించాలి. అచ్చెన్నాయుడి అరెస్టులో అవి లోపించాయి అంటూ జనసేన ఓ ప్రకటన విడుదల చేస్తే ..దానికి పూర్తిగా విరుద్ధంగా వార్తలు చేసాడు.

టీడీపీ హయాంలో టీడీపీ నాయకురాలిని సోషల్ మీడియాలో ఏదో అన్నారు అని మా జనసేన కార్యకర్తల మీద దొంగ కేసులు పెట్టి అరెస్ట్ చేసి, వాళ్లని గొడ్లని బాదినట్లు బాది, అంత హింస పెట్టిన టీడీపీ ఇప్పుడు ఒక నాయకుడి మీద స్కాం జరిగిందని పోలీసులు అరెస్ట్ చేస్తే మాత్రం టీడీపీ, టీడీపీ అనుకూల మీడియా అంత గగ్గోలు పెడుతున్నాయి.వాళ్లు కేవలం కార్యకర్తలు నాయకులు కారు అనేగా అప్పట్లో మీ ఉద్దేశం. కర్మకు మెనూ లేదు.. ఫలితాన్ని అనుభవిస్తారు. మా జనసేన కార్యకర్తలని అరెస్ట్ చేసి కొట్టించిన పాపం టీడీపీకి అంత తేలిగ్గా పోతుందా? మా జనసైనికుల పట్ల మీరు ప్రవర్తించిన తీరును మేము ఎన్నటికీ మర్చిపోము' అని నాగబాబు ట్విట్టర్‌ ద్వారా ఆగ్రహం వ్యక్తం చేశారు.

అయితే, వైసీపీ అధినేత జనసేన అధినేత పవన్ ను ఎంత దారుణంగా వ్యాఖ్యానించిందీ అందరికీ తెలుసు.  అయినప్పటికీ కూడా నాగబాబు వైసీపీ కి మద్దతుగా మాట్లాడటాన్ని జనసైనికులు జీర్ణించుకో లేకపోతున్నారు. అలాగే పవన్ కూడా బీజేపీ తో దోస్తీ అంటూ ముందుకుసాగుతున్నారు. ఇలా మొత్తంగా అన్న ఒకవైపు , తమ్ముడు మరోవైపు మద్దతుగా మాట్లాడుతూ ..ఆశలు ఏం మాట్లాడుతున్నారో వారికీ కూడా అర్థం కావడం లేదు అని జనసైనికులు అంటుకుంటున్నారు.
Tags:    

Similar News