సైమండ్స్ మృతదేహం వద్ద ఆయన పెంపుడు కుక్క చేసిన పని వైరల్

Update: 2022-05-16 09:53 GMT
ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం ఆండ్రూ సైమండ్స్ ఆదివారం క్వీన్స్ లాండ్ లోని టౌన్స్ విల్లే ఏరియా శివారులో కారు యాక్సిడెంట్ లో మరణించారు. ప్రస్తుతం ఈ ఘటనపై పోలీసులు విచారిస్తున్నారు. తాజాగా ఈ ఘటనకు సంబంధించిన ఓ ఆసక్తికర విషయం బయటకు వచ్చింది.

ఈ ఘటనలో సైమండ్స్ పంచుకున్న రెండు పెంపుడు కుక్కలు కారు యాక్సిడెంట్లో తృటిలో బతికి బయటపడ్డాయి. అందులో ఓ పెంపుడు కుక్క చేసిన పనిని ప్రత్యక్ష సాక్షి అయిన మహిళ మీడియాతో చెబుతూ వాపోయింది. అదిప్పుడు వైరల్ గా మారింది.

ఆండ్రూ సైమండ్స్ యాక్సిడెంట్ ను ప్రత్యక్షంగా చూసిన మహిళ మాట్లాడుతూ.. 'నా భర్త ఈ కారు యాక్సిడెంట్ జరిగిన వెంటనే వెళ్లి సైమండ్స్ ను బతికించడానికి ప్రయత్నం చేశారు. కానీ సైమండ్స్ స్పాట్ లోనే చనిపోయారు.

అతడి పల్స్ అప్పటికే ఆగిపోయింది. సైమండ్స్ పెంచుకున్న రెండు పెంపుడు కుక్కలు అతడితోపాటు కారులో ఉన్నాయి. అవి కూడా చనిపోయి ఉండొచ్చనుకున్నాం. కానీ తృటిలో అవి సజీవంగా బయటపడ్డాయి.

అందులో ఓ పెంపుడు కుక్క మాత్రం సైమండ్స్ మృతదేహాన్ని అస్సలు విడిచిపెట్టడానికి ఒప్పుకోలేదు. అక్కడక్కడే తిరుగుతూ మొరుగుతూ సైమండ్స్ ను లేవాలని హృదయ విదారకంగా రోడింది. దాని అరుపులు చూసి నా కళ్లల్లో నీళ్లు తిరిగాయి.

సైమండ్స్ దగ్గరికి వెళుతున్న ప్రతీసారి మా మీదకు అది అరిచింది. అతడి మృతదేహాన్ని స్థానికుల సహాయంతో ఆస్పత్రికి తరలించేందుకు ప్రయత్నిస్తుంటే అది మొరిగిందని ఆమె భావోద్వేగానికి గురైంది.

ఆస్ట్రేలియా జట్టులో మేటి ఆల్ రౌండర్లలో ఒకడిగా సైమండ్స్ ఎదిగాడు. జట్టుకు అన్ని విభాగాల్లో కీలక ఆటగాడిగా నాడు మారాడు. ఎన్నోసార్లు మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడాడు. సైమండ్స్ 1998లో ఆస్ట్రేలియా తరుఫున అంతర్జాతీయ క్రికెట్ లో అరంగేట్రం చేశారు. 2003,2007 ప్రపంచకప్ గెలిచిన జట్లలో కీలక ఆల్ రౌండర్ ఇతడు. ఇతడి మరణం సినీ ప్రపంచాన్ని విషాదంలో నింపింది.
Tags:    

Similar News