జగన్ గారు ప్రజలకి మీరిచ్చే భరోసా ఇదేనా : పవన్ కళ్యాణ్

Update: 2019-10-25 07:14 GMT
జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇప్పుడిప్పుడే మళ్ళీ రాజకీయంగా జోరు పెంచుతున్నాడు. అప్పుడప్పుడు వచ్చి సమావేశాలతో హడావిడి చేసి ..మళ్ళీ కొద్ద్దిరోజులపాటు మౌన నిద్రలోకి వెళ్లడం పవన్ కళ్యాణ్ కి అలవాటే. ఈ నేపథ్యంలోనే పవన్  జనసేన పార్టీ నేతలతో జిల్లాల వారీగా సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నారు.   ఇదే క్రమంలో తాజాగా  నెల్లూరు జిల్లా సమీక్షా సమావేశంలో పవన్ కళ్యాణ్ ఏపీ సీఎం జగన్ పై కీలక వ్యాఖ్యలు చేశారు.

జగన్ మోహన్ రెడ్డి ఇప్పటికి ముఖ్యమంత్రిగా అధికారాం చేపట్టి ఐదు నెలలు కావొస్తుంది.  కానీ, ఇప్పటివరకు సొంత బాబాయి వైయస్ వివేకానంద రెడ్డిని ఎవరు హత్యచేశారో, ఎందుకు హత్య చేశారో తెలుసుకోలేక పోయారని , అలాగే  కోడి కత్తితో దాడి చేయించింది ఎవరో తెలుసుకోలేనక పోయారంటూ చెప్పుకొచ్చారు. ఐదు నెలల పరిపాలన కాలంలో వైసిపి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటికీ ఈ రెండు ముఖ్యమైన ఘటనలకు సంబంధించిన దోషులనే పెట్టుకోలేని ఈ ప్రభుత్వం  ప్రజలకు ఎటువంటి  భరోసా  ఇస్తుంది అంటూ సీఎం జగన్ ని  ప్రశ్నించారు.
Read more!

ఇంకా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ఏపీలో అధికారంలో లేని నాడు గత ప్రభుత్వం కావాలని కేసులను తప్పుదారి పట్టిస్తున్నారని ఆరోపణలు చేసారని, ప్రస్తుతం  అధికారంలో ఉండేది మీరే కదా మరి దోషులని ఎందుకు పట్టుకోలేకపోయారంటూ ఆగ్రహం వ్యక్తం చేసారు. అలాగే ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో  జగన్ పై దాడి జరిగితే నేను ఖండించానని తెలిపాడు. అలాగే ఆనాడు ఏపీ పోలీస్ వయ్వస్థ పై నమ్మకం లేక తెలంగాణ పోలీసులను ఆశ్రయించారని, ఇప్పుడు రాష్ట్రంలో ఉన్నది వైసిపి ప్రభుత్వమే కాబట్టి  వైయస్ వివేకానంద రెడ్డి హత్య చేసింది ఎవరో, కోడికత్తితో దాడి చేయడానికి ఆ కుర్రాడిని ప్రేరేపించింది ఎవరు అనే విషయాలని బయటపెట్టి .. ప్రజలకి భరోసా కల్పించాలని చెప్పారు.
Tags:    

Similar News