ఏపీలో జ‌గ‌న్‌కు పాలాభిషేకాలు.. సీక్రెట్ ఇదే!

Update: 2022-01-09 10:30 GMT
ఏపీలో చిత్రాలు చోటు చేసుకుంటున్నాయి. ప‌లు జిల్లాల్లో ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ బ్యాన‌ర్ల‌కు కొంద‌రు పాలాభి షేకాలు చేస్తున్నారు. మ‌రికొందరు.. త‌మ ఇళ్ల‌లోనే జ‌గ‌న్ చిత్ర‌ప‌టాల‌ను దేవుడి మందిరంలో పెట్టుకుంటామ‌ని చెబుతున్నారు. ఇలా.. చాలా జిల్లాల్లో రాజ‌కీయ వాతావ‌ర‌ణం ఒక్క‌సారిగా మారిపోయింది. అయితే.. ఇది బ‌ల‌వంతం చేస్తున్నారా?  లేక నిజంగానే చేస్తున్నారా? అనేది చ‌ర్చ‌కు దారితీసింది. మ‌రి దీనికి రీజ‌న్ ఏంటి?  వెనుక ఉన్న సీక్రెట్ ఏంటి అనేది కూడా ఆస‌క్తిగా మారింది. విష‌యంలోకి వెళ్తే.. ఈ నెల 1 వ‌తేదీ నుంచి సీఎం జ‌గ‌న్‌.. సామాజిక పింఛ‌న్ల‌ను పెంచారు.

ఇప్ప‌టి వ‌ర‌కు రూ.2250గా ఉన్న పింఛ‌న్‌ను మ‌రో రూ.250 పెంచారు. ఇది రాష్ట్ర వ్యాప్తంగా వృద్ధులు, వితం తువులు, ఒంట‌రి మ‌హిళ‌ల‌కు వ‌ర్తింప చేశారు. అయితే.. తొలిరోజు రెండో రోజు ఈ పింఛ‌న్ల పంపిణీ ఒక ర‌కం గా.. సాధార‌ణంగా సాగిపోయింది. అయితే.. ఐదో తేదీ నుంచి రాష్ట్ర‌వ్యాప్తంగా.. వృద్ధులు జ‌గ‌న్ చిత్ర ప‌టాన్ని చేతిలో పెట్టుకుని.. పింఛ‌న్ అందుకుంటున్న ఫొటోల‌ను దిగారు. అయితే.. అక‌స్మాత్తుగా ఈ నిర్ణ‌యం రావ‌డం ఏంటి? అనేది చిత్రంగా ఉంది. దీనికి తాడేప‌ల్లి నుంచి వ‌చ్చిన ఫోన్ కాలేన‌ని వ‌లంటీర్లు బాహాటంగానే చెబుతున్నారు.

వాస్త‌వానికి ఎన్నిక‌ల స‌మ‌యంలో జ‌గ‌న్ ఇచ్చిన హామీ మేర‌కు.. పింఛ‌న్ ఏటా రూ.250 చొప్పున పెర‌గాలి. ఆ లెక్క‌న ఇప్ప‌టికే రూ.2750 అవ్వాలి. కానీ, ఇప్పుడు రూ.250 త‌క్కువ‌గానేఉంది.దీంతో వృద్ధులు, ఇత‌ర వ‌ర్గాలు కూడా ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నాయి. కానీ, వీరంతా సంబ‌రాలు చేసుకుంటున్నారంటూ.. రాష్ట్ర వ్యాప్తంగా పాలాభిషేకాలు చేయిస్తున్నారు. మ‌రి ఇది బ‌ల‌వంతం కాదా? అనేది ప‌రిశీల‌కుల ప్ర‌శ్న‌. మ‌రోవైపు.. ఈ రోజు ఉద‌యం నుంచి ఉద్యోగులు కూడా జ‌గ‌న్ చిత్ర‌ప‌టానికి పాలాభిషేకాలు చేస్తున్నారు. త‌మ‌కు పీఆర్‌సీ ప్ర‌క‌టించార‌ని.. రిటైర్మెంట్ వ‌య‌సు పెంచార‌ని.. అందుకే.. పాలాభిషేకం చేస్తున్నామ‌ని వారు చెబుతున్నారు.

వాస్త‌వానికి ఉద్యోగులు కోరుకున్న మేర‌కు పీఆర్ సీ పెంచ‌లేదు. ఇక‌, ప్ర‌స్తుతం రిటైర్ అయిన వారికి బెని ఫిట్స ఇవ్వ‌లేదు. పైగా.. వారు కోరుకున్న విధంగా ఫిట్ మెంట్‌ను ఇవ్వ‌లేదు. ఇదే విష‌యంపై.. ఉద్యోగు లు తీవ్ర ఆగ్ర‌హంతో ఉన్నారు. ఈ నేప‌థ్యంలో సంఘాల నేత‌లు కూడా ఫోన్ల‌ను స్విఛాఫ్ చేసుకున్నారు. మ‌రి క్షేత్ర‌స్థాయిలో ఇంత జ‌రుగుతున్నా.. కూడా జ‌గ‌న్‌కు పాలాభిషేకాలు ఎలా చేస్తున్నారు? అనేది ప్ర‌శ్న‌. దీనికి కూడా వెన‌కాల తాడేప‌ల్లి నుంచి వ‌చ్చిన ఫోన్ కాలే కార‌ణ‌మ‌నే గుస‌గుస వినిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం.
Tags:    

Similar News