తెలుగు మహిళల్లో అంతమందికి నెట్ అంటే తెలియదట !
ప్రస్తుతం స్మార్ట్ ఫోన్స్ యుగం నడుస్తుంది. ప్రపంచంలోని ఏ మూల ఏం జరిగినా కూడా క్షణాల్లో ప్రపంచం మొత్తం తెలిసిపోతుంది. స్మార్ట్ ఫోన్స్ అనేవి ఇప్పుడు అందరి చేతుల్లో కామన్ అయిపోయాయి. ఇక స్మార్ట్ ఫోన్స్ వాడకం పెరిగిపోయింది కదా , ఇక నెట్ గురించి అందరికి తెలిసే ఉంటుంది అనుకుంటే పొరపాటే. పన్నెండు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఇప్పటివరకు ఇంటర్నెట్ ను ఉపయోగించని మహిళలు నూటికి 60 మందికిపైగానే ఉన్నారట.
తెలంగాణలో ఇప్పటి వరకు నెట్ ఉపయోగించని మహిళలు 74.1 శాతం అయితే ఏపీలో ఇది ఇంకాస్త ఎక్కువగా 79 శాతంగా ఉంది. అంటే తెలంగాణ 26.5, ఏపీలో 21 శాతం మహిళలే ఇంటర్నెట్ ను ఉపయోగిస్తున్నారు. మహిళల అక్షరాస్యత తక్కువగా ఉన్న రాష్ట్రా ల జాబితాలోనూ తెలుగు రాష్ట్రాలున్నాయి. తెలంగాణ మహిళల్లో 66.6, ఏపీలోని మహిళల్లో 68.6 శా తం మాత్రమే అక్షరాస్యులు అని తేలింది. పురుషుల్లో అత్యల్ప అక్షరాస్యత ఉన్న రాష్ట్రాల్లో ఏపీ కూడా ఒకటి. ఏపీలోని పురుషుల్లో 79.5 మాత్రమే అక్షరాస్యులు. ఈ మేరకు జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే సంస్థ సర్వే నిర్వహించింది.
అసోంలో 28.2శాతం, బిహార్ లో 20.6, గుజరాత్ లో 30.8 త్రిపురలో 22.9, మేఘాలయలో 34.7, మహారాష్ట్రలో 38, కర్ణాటకలో 35, పశ్చి మ బెంగాల్‌లో 25.5, దాద్రానగర్ హవేలీలో 26.5, డామన్ అండ్ డయ్యూ లో 36.7, అండమాన్ అండ్ నికోబార్ లో 34.8 శాతం మహిళలే ఇంటర్ నెట్ ను వినియోగిస్తున్నారు. పురుషుల అక్షరాస్యతలోనూ లక్షద్వీప్ 99.1 టాప్‌లో ఉంది. ఆ తర్వాత కేరళ 98.2 రెండో స్థానం లో ఉంది ఏపీలో 15-19 ఏళ్ల మధ్య ఆడపిల్లల్లో 12.6 శాతం గర్భిణులు లేదంటే తల్లులు అని తేలింది. బిహార్ లో ఇది 11, త్రిపురలో 21.9, పశ్చిమబెంగాల్ లో 16.4 శాతం ఉంది. బిహార్, పశ్చిమబెంగాల్, త్రిపురలో 40 శాతం మహిళలకు 18 ఏళ్లలోపే పెళ్లవుతోంది. దేశంలోని జనాభాలో 90 శాతం మంది ఇళ్లలో విద్యుత్తు సౌకర్యం ఉంది. 70శాతం మంది ఇళ్లకు మెరుగైన తాగునీటి వసతి ఉంది. దేశంలోని దాదాపు అన్ని ఇళ్లలో అయోడిన్ ఉప్పునే వాడుతున్నారు.