హిందువుని పెళ్లాడడం బెటరన్న ముస్లిం యువతి

Update: 2017-04-22 08:09 GMT
మూడు సార్లు 'తలాక్' చెప్పి విడాకులు ఇచ్చే ముస్లిం ఆచారంపై చర్చ జరుగుతునత్న సమయంలో ఉత్తర్ ప్రదేశ్ లో ఓ ముస్లిం యువతి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. తన సోదరికి తలాక్ వల్ల జరిగిన అన్యాయంపై రగిలిపోతూ సంచలన వ్యాఖ్యలు చేసింది. జీవితాంతమూ ట్రిపుల్ తలాక్ గురించి ఆలోచించి భయపడుతూ తానెందుకు బతకాలని.. అలా చేసుకుంటే తనకూ తన అక్కకు పట్టిన గతే పడుతుందని అంటూ పోలీసులను ఆశ్రయించింది. ఉధమ్ సింగ్ నగర్ జిల్లా కచ్చా పోలీసు స్టేషన్ కు వచ్చిన ఈ యువతి - ఏ క్షణమైనా భార్యను వదిలేసేలా నిబంధనలు ఉన్న మతంతో లాభమేంటని, భార్యను వదిలివేసే అవకాశం ఉన్న వ్యక్తితో జీవితాంతమూ ఎలా ఉండగలనని ప్రశ్నించింది. దీనికన్నా హిందూ మతాన్ని స్వీకరించి - హిందూ వ్యక్తిని పెళ్లాడటం ఉత్తమమని అంది.
    
ఇండియాలో ముస్లిం మహిళల కోసం ప్రధాని నరేంద్ర మోదీ చేపట్టిన చర్యలు తృప్తికరంగా ఉన్నాయని, ట్రిపుల్ తలాక్ కు తక్షణం స్వస్తి చెప్పాల్సిన అవసరం ఉందని ఆ యువతి అభిప్రాయపడింది.  మూడు పదాలను ఉచ్ఛరించడం ద్వారా నా జీవితాన్ని నాశనం చేయడానికి అవకాశం లేని హిందూ వ్యక్తిని పెళ్లాడటం బెటర్‌ అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.
    
దేశంలో మహిళలు - ముఖ్యంగా ముస్లిం మహిళల కోసం ప్రధానమంత్రి నరేంద్రమోదీ చేపడుతున్న చర్యలు బాగున్నాయని ఆమె పేర్కొంది. వాట్సప్‌ - ఫేస్‌ బుక్‌ లలో సైతం ట్రిపుల్‌ తలాక్‌ చెబుతున్న సంఘటనల నేపథ్యంలో.. దేశవ్యాప్తంగా ముస్లిం మహిళలు ట్రిపుల్‌ తలాక్‌ పద్దతికి స్వస్తి చెప్పాలని కోరుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అదే వర్గానికి చెందిన ఓ యువతి ఇలా బయటకొచ్చి ధైర్యంగా మాట్లాడడం సంచలనంగా మారింది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News