ఆన్ లైన్ లోన్ యాప్స్ కేసు: నిందితుల నుంచి కీలక సమాచారం
ఆన్ లైన్ లోన్ యాప్స్ పేరిట రుణాలిచ్చి జనాలను పీక్కుతింటున్న సంస్థల ఆట కట్టిస్తున్నారు పోలీసులు. ఇప్పటికే పలు కార్యాలయాలపై దాడులు చేసిన కీలక వ్యక్తులను అరెస్ట్ చేశారు. తాజాగా ఈ కేసులో సైబర్ క్రైమ్ పోలీసులు మరింత దూకుడు పెంచారు. ప్రధాన నిందితులను అరెస్ట్ చేసిన అధికారులు.. మరికొందరు నిందితుల నుంచి కీలక సమాచారాన్ని రాబట్టారు.
కీర్తి అనే ఉద్యోగిని సిమ్ బాక్సులను పోలీసులు స్వాధీనం చేసుకొని అందులోని యూఎన్ యూ కంపెనీ రహస్యాలను రాబట్టారు. చైనా కంపెనీలు ఇప్పటికే వందల కోట్ల రూపాయాలను కొల్లగొట్టినట్టు ఆధారాలు రాబట్టారు.తాజాగా బెంగళూరులో ఉండే కాల్ సెంటర్ లో ఉన్న మూడు సిమ్ బాక్సులను స్వాధీనం చేసుకున్నారు. కీర్తి అనే నిర్వాహకురాలి సిమ్ బాక్సుల ద్వారా కస్టమర్లను ఎలా బెదిరించారో తెలుసుకున్నారు. ఆ సిమ్ బాక్సులను హైదరాబాద్ కు తీసుకొచ్చారు.
యూ ఎన్ యూ కంపెనీ ఆర్తిక లావాదేవీలపై ఆరాతీస్తున్నారు. జియాంగ్ అనే చైనా వ్యక్తి కనుసన్నల్లో గత ఏడాది జనవరిలో ఈ రుణయాప్ లు ప్రారంభమైనట్టు పోలీసులు గుర్తించారు. చైనాకు చెందిన జెన్నిఫర్ సలహాలు, సూచనలతో నిందితులు బెంగలూరులో కార్యాలయాన్ని ప్రారంభించినట్టు తెలిసింది. ఈ కంపెనీ హెచ్ఆర్ గా కీర్తిని నియమించారు. 300 మంది ఉద్యోగులతో రుణాలను ఇవ్వడం మొదలుపెట్టారు.గత ఏడాది మార్చిలో కంపెనీకి భారీ లాభాలు వచ్చాయి. రోజుకు ఏకంగా 30 కోట్ల వరకు లాభాలు వచ్చినట్లు పోలీసులు గుర్తించారు. వాటి గుట్టును ఇప్పుడు బయటపెడుతున్నారు.