జగన్ సర్కార్ పాచికతో జూదరులకు చెక్
జూదం...ఎందరో జీవితాలను ఛిద్రం చేసే ఓ భయంకరమైన వ్యసనం. ధర్మరాజు జూదంలో సమస్త సామ్రాజ్యాన్ని, ధర్మపత్నిని ఓడిపోయిన ఘటన అందుకు నిలువెత్తు తార్కాణం. అప్పటి నుంచి ఇప్పటి వరకు జూదం అనేక రూపాలు మారినా....ఆ వ్యసనం బారిన పడినవారి తలరాతలు మాత్రం మారలేదు. పేకాట వంటి జూదాల బారినపడి కోట్లు...కోటల్లాంటి ఇళ్లు పోగొట్టుకున్నవారెందరో ఉన్నారు. పెళ్లాం పుస్తెలు తాకట్టు పెట్టి మరీ జూదమాడి ఓడిన వారు ఇంకెందరో ఉన్నారు. ఇపుడు కాలం మారింది. కాలంతోపాటు జూదం రూపం మార్చుకొని ఆన్ లైన్ రమ్మీ, పోకర్ వంటి రకరకాల వికృత రూపాలను దాల్చింది. ఆన్ లైన్ రమ్మీతో అరచేతిలో పేకాట క్లబ్బు ప్రత్యక్షం కావడం....ఆన్ లైన్ లోనే నగదు బదిలీ కావడంతో గుట్టు చుప్పుడు కాకుండా జూదమాడుతున్నారు. లాక్ డౌన్ సమయంలో ఈ జూదం మహమ్మారి కరోనా కన్నా ప్రమాదకరంగా మారింది.
ఈ వ్యసనం బారిన పడి యువతతోపాటు పలువురు డబ్బు కోసం పెడదోవపడుతున్నారు. ఆన్ లైన్ లేదా ఆఫ్ లైన్ లో పేకాట, రమ్మీ ఆడేందుకు కొందరు అడ్డదారులు తొక్కుతూ నేరాలకుూ పాల్పడున్నారు. ఈ నేపథ్యంలోనే జూదరులపై ఏపీ సర్కార్ ఉక్కుపాదం మోపింది. ఆన్ లైన్ రమ్మీ, పోకర్ వంటి జూదాలపై నిషేధం విధించింది. ఆన్ లైన్ జూదరులకు చెక్ పెట్టేందుకు జగన్ సర్కార్ కఠినమైన శిక్షలు అమలు చేయనుంది. ఆన్ లైన్ గేమ్ లు నిర్వహించేవారికి ఏడాది జైలు శిక్ష, ఆడేవారికి ఆరు నెలలు జైలుశిక్ష విధించనుంది. రెండోసారి రెండేళ్ల జైలు, జరిమానా విధించేందుకు సిద్ధమైంది. ఇప్పటికే పొరుగు రాష్ట్రం తెలంగాణలో పేకాట, ఆన్ లైన్ రమ్మీ, బెట్టింగ్ లపై తెలంగాణ ప్రభుత్వం నిషేధం విధించింది. 2017లో ‘తెలంగాణ గేమింగ్ యాక్ట్’లో మార్పులు చేసి వాటిపై నిషేధం విధించింది. ఇదే క్రమంలో తాజాగా జగన్ సర్కార్ ఆన్ లైన్ రమ్మీపై నిషేధం విధించింది.
అయితే, ఆన్ లైన్ రమ్మీతోపాటు గుర్రపు పందేలు, కోడి పందేలు, ఎడ్ల పందేలు, నంబర్లాట, జిగ్ వంటివి కూడా జూదాల కిందకే వస్తాయని, వాటిపై కూడా నిషేధం విధించాలని పలువురు అభిప్రాయపడుతున్నారు.ఇక, ఏపీలో లాటర టెకెట్లపై నిషేధం ఉన్నప్పటికీ...కొందరు ఆన్ లైన్ ద్వారా, అడ్డదారుల్లో టికెట్లు కొని జూదమాడుతున్నారు. వాటిపై పోలీసుల నిఘా పెంచాలని కోరుతున్నారు. సంక్రాంతి సందర్భంగా కోడిపందేలు యథేచ్ఛగా జరుగుతుంటాయని, ఆ సమయంలో వందల కోట్లు చేతులు మారుతుంటాయని, వాటిపై పోలీసులు మరింత నిఘా పెట్టి కఠిన శిక్షలు విధించాలని అభిప్రాయపడుతున్నారు. ఏది ఏమైనా జగన్ సర్కార్ పాచికతో జూదరులకు చెక్ పడిందని, బెట్టింగ్ బంగార్రాజులకు జగన్ ఫిట్టింగ్ పెట్టారని అనుకుంటున్నారు.