ఏపీలో ఓలా ఈ–స్కూటర్ల ప్లాంట్స్ ... !

Update: 2020-11-04 08:30 GMT
ఓలాలో భాగమైన ఎలక్ట్రిక్‌ వాహనాల తయారీ సంస్థ ఓలా ఎలక్ట్రిక్‌ తాజాగా ఈ స్కూటర్ల తయారీ ప్లాంటు ఏర్పాటు చేయాలని ఆలోచనలో ఉంది. దాదాపుగా  20 లక్షల యూనిట్ల వార్షిక సామర్థ్యం తో దీన్ని నెలకొల్పనుంది. దీనికోసం అనువైన ప్రాంతాన్ని ఎంచుకోవడంపై కసరత్తు చేస్తోంది. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్‌ తో పాటు తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర ప్రభుత్వాలతో చర్చలు జరుపుతున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. 100 ఎకరాల విస్తీర్ణం లో ఓలా ఈ అధునాతన ప్లాంటు ను ఏర్పాటు చేయనుందని, సౌర విద్యుత్‌ ను విస్తృతం గా వినియోగించనుందని వివరించాయి.

రాబోయే ,18–24 నెలల్లో ఉత్పత్తి ప్రారంభించాలని ఓలా ఎలక్ట్రిక్‌ యోచిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీనిపై స్పందించేందుకు ఓలా వర్గాలు నిరాకరించాయి. ఎలక్ట్రిక్‌ స్కూటర్ల విభాగం లో బజాజ్‌ ఆటో, హీరో ఎలక్ట్రిక్‌ తదితర సంస్థలతో ఓలా పోటీ పడాల్సి రానుంది. దీనికోసం అవసరమైన నిధులను సమకూర్చుకోవడంలో భాగంగా టైగర్‌ గ్లోబల్, మ్యాట్రిక్స్‌ ఇండియా, టాటా సన్స్‌ గౌరవ చైర్మన్‌ రతన్‌ టాటా సహా పలు దిగ్గజ సంస్థల నుంచి ఓలా ఎలక్ట్రిక్‌ దాదాపు 40 కోట్ల డాలర్లు సమీకరించింది. ఇటీవల మేలో ఆమ్‌ స్టర్‌ డామ్ ‌కి చెందిన ఎటర్గో బీవీ సంస్థ ను కొనుగోలు చేసింది. 1,000 మంది ఇంజినీర్లను నియమించుకుంటున్నట్లు, త్వరలో ఎలక్ట్రిక్‌ ద్విచక్ర వాహనాన్ని ప్రవేశ పెట్టనున్నట్లు ఆగస్టులో వెల్లడించింది.

ఆటో మొబైల్‌ పరిశ్రమలో ఎలక్ట్రిక్‌ వెహికిల్స్‌ గేమ్‌ ఛేంజర్ ‌గా మారనుంది. ద్విచక్ర, త్రిచక్ర, ఆటో విభాగంలోని వాహనాలు రయ్‌ మని దూసుకుపోనున్నాయి. 2030 నాటికి దేశంలో మొత్తం ద్విచక్ర వాహన పరిశ్రమలో ఎలక్ట్రిక్‌ టూవీలర్స్‌ 25–35 శాతం, త్రీవీలర్స్‌ 65–75 శాతం, ప్యాసింజర్‌ వెహికిల్స్‌  10–15 శాతం, పర్సనల్‌ సెగ్మెంట్‌ 20–30 శాతం, ఎలక్ట్రిక్‌ బస్‌లు 10–12 శాతానికి చేరుకుంటాయని కేపీఎంజీ–సీఐఐ సంయుక్తంగా విడుదల చేసిన ‘‘షిఫ్టింగ్‌ గేర్స్, ఎవాల్వింగ్‌ ఎలక్ట్రిక్‌ వెహికిల్‌ ల్యాండ్‌స్కేప్‌ ఇన్‌ ఇండియా నివేదిక తెలిపింది. 
Tags:    

Similar News