రాహుల్ గాంధీపై హాట్ కామెంట్ చేసిన ఒబామా!

Update: 2020-11-13 07:10 GMT
అమెరికా అధ్యక్షుడిగా దిగిపోయాక బరాక్ ఒబామా తనకు ఇష్టమైన వ్యాపకాలపై వైపు వెళ్లిపోయారు. తాజాగా ఒక కొత్త పుస్తకం రాశారు. దాని పేరు ‘ఏ ప్రామిస్డ్ ల్యాండ్’. అమెరికా అధ్యక్ష ఎన్నికల వేడిలో రిలీజ్ అయిన ఈ పుస్తకం ఇప్పుడు హాట్ కేకుల్లా అమ్ముడుపోతోందట.. ఈ పుస్తకానికి అమెరికాలో విపరీతమైన డిమాండ్ వచ్చిందట..ఇదివరకు ఒబామా రాసిన పుస్తకాలతో పోల్చుకుంటే దీనికి గిరాకీ అధికంగా ఉందట..

ఇక ప్రపంచవ్యాప్తంగా.. ముఖ్యంగా భారత్ లోనూ దీనిపై ఆసక్తి నెలకొంది. ఎందుకంటే ఈ పుస్తకంలో ఒబామా భారత్ సహా పలు దేశాలతో అమెరికాకు ఉన్న దౌత్య సంబంధాలు.. ఆయా దేశాల పరిపాలకులు, రాజకీయ నేతల గురించి ఇందులో ప్రస్తావించడం దీనికి కారణం.  

ఈ పుస్తకంలో భారత్ తో ఉన్న అనుబంధాన్ని ఒబామా ప్రత్యేకంగా ప్రస్తావించారు. మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ సారథ్యంలోని యూపీఏ ప్రభుత్వ హయాం గురించి ప్రస్తావించారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీతోపాటు మన్మోహన్, రష్యా అధ్యక్షుడు పుతిన్, తాజా అధ్యక్షుడు జోబైడెన్ పైనా ఒబామా తన భావాలు వెల్లడించారు.

ఈ పుస్తకంలో రాహుల్ గాంధీపై ఒబామా హాట్ కామెంట్స్ చేశారు. తన దృష్టిలో రాహుల్ గాంధీ.. హోంవర్క్ ను అందరికంటే ముందే పూర్తి చేసుకొని టీచర్ ను ఇంప్రెస్ చేయాలనుకునే విద్యార్థి అని ఒబామా పుస్తకంలో ఎద్దేవా చేశారు. సబ్జెక్ట్ పై మాత్రం ఆయన పట్టును సాధించలేకపోతున్నారని అన్నారు. ఆ సబ్జెక్ట్ పై మాస్టర్ గా వ్యవహరించలేకపోతున్నారని చెప్పారు.  పట్టు సాధించడానికి రాహుల్ గాంధీ చేయాల్సింది చాలా ఉందని వ్యాఖ్యానించారు.

అలసత్వం, నైపుణ్య లక్షణాలను అభివృద్ధి చేసుకోవాల్సి ఉందని అన్నారు. నెర్వస్, అన్ ఫార్మ్ డ్ క్వాలిటీ ఆయనలో ఉన్నాయని చెప్పారు. ఇక సోనియాను ‘చార్లీ క్రైస్ట్, రెహ్మ ఎమ్మానుయెల్ తో ఒబామా పోల్చారు. పురుషులతో సమానంగా అసాధారణ ప్రతిభ ఉందని అన్నారు.
Tags:    

Similar News