ముకేశ్ అంబానీతో జత కట్టేందుకు ప్రపంచ కుబేరుడు రెఢీ?
వారిద్దరు ఎవరికి వారే. వారెక్కడ పెట్టుబడి పెట్టినా కాసుల వర్షమే. అలాంటి ఇద్దరు ప్రపంచ కుబేరులు కలిసి బిజినెస్ చేయాలన్న ఆలోచనకు వస్తే? ఐడియానే అదిరిపోయింది కదా? మరి.. ఇది వాస్తవ రూపం దాలిస్తే.. వేలాది కోట్ల వ్యాపారం వారి వశం కావటం ఖాయం. తాజాగా అలాంటి కాంబినేషన్ ఒకటి త్వరలో రియాలిటీలోకి రానున్నట్లుగా మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ప్రపంచంలో మోస్ట్ సక్సెస్ ఫుల్ బిజినెస్ మ్యాన్ గా అభివర్ణించే అమెజాన్ అధినేత జెఫ్ బెజోన్.. రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీలు ఇద్దరు జత కట్టబోతున్నట్లుగా చెబుతున్నారు. దీనికి సంబంధించి ఆసక్తికర అంశాలు ఇప్పుడు వ్యాపార ప్రపంచంలో హాట్ టాపిక్ గా మారాయి.
విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం అంబానీకి చెందిన రిలయన్స్ రిటైల్ లో 9.9 శాతం వాటాను అమెజాన్ అధినేత కొనేందుకు ఆసక్తిని చూపుతున్నట్లు చెబుతున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే వీరిద్దరి మధ్య ప్రాథమిక చర్చలుపూర్తి అయినట్లుగా చెబుతున్నారు. ఈ వాదనకు బలం చేకూరేలా ఇటీవల ముకేశ్ నోటి నుంచి వచ్చిన వ్యాఖ్యల్ని పలువురు ప్రస్తావిస్తున్నారు. గడిచిన వారంలో నిర్వహించిన రిలయన్స్ ఇండస్ట్రీస్ వాటాదారుల వార్షిక సాధారణ సమావేశంలో మాట్లాడిన అంబానీ.. రిలయన్స్ రిటైల్ లో వాటాల కొనుగోలుకు వ్యూహాత్మక.. ఆర్థిక పెట్టుబడిదారులు ఆసక్తి కనబరుస్తున్నారని చెప్పటం తెలిసిందే.
ఈ నేపథ్యంలో రిలయన్స్ రిటైల్ ను కూడా అమ్మే అవకాశం ఉందని చెబుతున్నారు. ఇప్పటికే రిలయన్స్ జియో ఫ్లాట్ ఫాం మీద 32.84 శాతం వాటాను అమ్మటం ద్వారా రూ.1.52లక్షల కోట్లను సమీకరించటమే కాదు.. ఫేస్ బుక్.. గూగుల్.. ఇంటెల్ లాంటి భారీ టెక్నాలజీ కంపెనీలు జియో చట్రంలోకి వచ్చేలా చేశారు. దీంతో.. సాంకేతికంగా జియో మరింత బలోపేతం కావటం తెలిసిందే.
రిలయన్స్ రిటైల్.. అమెజాన్ లు జత కట్టటం ఇరువురికి మంచిదేనన్న మాట వినిపిస్తోంది. దీనికి కారణం ఇప్పటికే కిశోర్ బియానీకి చెందిన ఫ్యూచర్ రిటైల్ లో మెజార్టీ వాటాను కొనుగోలు చేసేందుకు రిలయన్స్ ప్రయత్నిస్తోంది. అదే జరిగితే.. ఇప్పటికే ఫ్యూచర్ రిటైల్ లో భాగస్వామి అయిన అమెజాన్.. రిలయన్స్ లో జత కట్టటం ఖాయమని చెబుతున్నారు. తమతో కలిస్తే.. రిలయన్స్ రిటైల్ లో భాగస్వామికావటంతో పాటు.. జియో మార్ట్ సేవలు కూడా అందే వీలుంది. ఈ డీల్ ఇరువురికి లాభసాటిగా మారే అవకాశం ఉండటంతో.. వీరిద్దరు కలిసే అవకాశమే ఎక్కువని చెబుతున్నారు.