నేనా... రాష్ర్టపతినా.. అంత సీను లేదండీ

Update: 2016-12-03 06:09 GMT
బాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ అమితాబ్‌ బచ్చన్‌ను రాష్ట్రపతి పదవికి మోడీ ఎంపిక చేస్తారన్న ప్రచారం కొద్దికాలంగా సాగుతోంది. ఆయన సహనటుడు - బిజెపి నాయకుడు శత్రుఘ్న సిన్హా చేసిన వ్యాఖ్యలు దీనికి కారణం.  అయితే... అమితాబ్ మాత్రం తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆ అవకాశాలను కొట్టిపారేశారు. ఆ పదవికి తగిన అర్హతలు తనకు లేవన్నారు.
    
అమితాబ్ రాష్ట్రపతి అయితే బాగుంటుందని శత్రుఘ్న సిన్హా ఒకట్రెండుసార్లు చెప్పిన విషయంపై ఆయన మాట్లాడుతూ... అదంతా సరదా వ్యాఖ్యలు - ఊహాగానాలని కొట్టిపారేశారు. ”శత్రుఘ్న సిన్హా నా స్నేహితుడు. మేం సరదాగా చాలా విషయాలు మాట్లాడుకుంటూ ఉంటాం. ఇది ఓ జోక్‌ కింద అతను చెప్పి ఉంటారు.  నా గురించి ఇలాంటి వ్యాఖ్యలు అతను చేస్తూనే ఉంటాడు. వాటికి అర్థాలు లాగక్కర్లేదు” అని అన్నారు.
    
అంతేకాదు... తనకు అంత పెద్ద పదవికి తగ్గ అర్హత లేదని ఆయన చెప్పారు. ‘నాకంత విలువ లేదు. నేను దానికి అర్హుడ్ని కాదు. నేను ఏదైనా చెయ్యలేనప్పుడు, దానికోసం ఎన్నడూ పాకులాడను. దాన్ని సంపాదించడానికి ఎన్నడూ ప్రయత్నించను. ఆ ఆలోచనే అసంబద్ధం. కాబట్టి దాని గురించి చర్చ ఇక ముగిద్దాం” అని స్పష్టం చేశారు. మరి బిగ్ బీ మనసులో నిజంగానే ఆ కోరిక లేదా... లేదంటే.. ముందుగానే హడావుడి ఎందుకని గోప్యత పాటిస్తున్నారా అన్నది కాలమే చెప్పాలి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News