కేంద్రానికి సీఎం షాక్.. రాజీనామాకు రెడీ?

Update: 2020-10-21 14:30 GMT
కేంద్ర ప్రభుత్వాన్ని ఒక సీఎం నేరుగా ఢీకొట్టారు. కేంద్రం ఇటీవల తీసుకొచ్చిన వ్యవసాయ సంస్కరణల చట్టాన్ని పంజాబ్ ప్రభుత్వం సవాల్ చేసింది. ఈ మేరకు నిండు అసెంబ్లీలో పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్ సంచలన ప్రకటన చేశారు.

కేంద్రం చట్టం అమలు చేయకపోతే తమ ప్రభుత్వాన్ని రద్దు చేసినా ఫర్వాలేదని.. కానీ రైతు వ్యతిరేక చట్టాన్ని మాత్రం తాము అమలు చేసేది లేదని పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్ సంచలన ప్రకటన చేశారు. ఇదిప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.

ఇప్పటికే ఈ చట్టాన్ని తెలంగాణ సీఎం కేసీఆర్, బెంగాల్ సీఎం మమత సహా పలు ఉత్తరాధి రాష్ట్రాల సీఎంలు వ్యతిరేకించారు. చాలా రాష్ట్రాల్లో రైతులు రోడ్డెక్కి ఆందోళన చేశారు. ఇక కేంద్రం వ్యవసాయ బిల్లుల చట్టం ముసాయిదాను విడుదల చేసిన దగ్గర నుంచి పంజాబ్ రైతులు వ్యతిరేకిస్తున్నారు. దీంతో తమకు అన్యాయం అని ఆందోళన చేస్తున్నారు.

పంజాబ్ లో రైతు సంఘాలు, రైతులు ఏకమై ఆందోళన చేస్తున్నారు. పార్టీలకు అతీతంగా ఆందోళన బాటపట్టారు. ఈ రైతుల ఆందోళన సెగ అసెంబ్లీ సమావేశాలకు తగిలింది.

దీంతో సీఎం అమరీందర్ సింగ్ తాజాగా రాజీనామాకు కూడా సిద్ధమవ్వడం సంచలనమైంది. కేంద్రం చట్టాన్ని అమలు చేసేది లేదని.. ఈ క్రమంలోనే పంజాబ్ ప్రభుత్వాన్ని రద్దు చేసినా తాను రైతుల పక్షానే నిలుస్తానని కేంద్రానికి సవాల్ చేశారు. మరి కేంద్రం ఇప్పుడు ఈ విషయంలో ఏం నిర్ణయిస్తుందనేది ఆసక్తిగా మారింది.
Tags:    

Similar News