సన్నబడిన బ్యాడ్ రూలర్... ఫోటోస్ వైరల్

Update: 2022-01-01 06:35 GMT
ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ మరోసారి వార్తల్లో నిలిచారు. ఇటీవల ఆ దేశ మీడియా విడుదల అయిన ఓ ఫోటో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. ఇందుకు ప్రధాన కారణం కిమ్ ఆ ఫోటో లో చాలా సన్నగా కనిపించడమే. సాధారణంగా కిమ్ చాలా లావుగా ఉంటారు. ఆయన ఆహార్యం కూడా గొప్పగా ఉంటుంది. ప్రత్యేకించి ఆయన హెయిర్ స్టైల్ కూడా కొంత మేరకు డిఫరెంట్ గా ఉంటుంది. అయితే కిమ్ కు సంబంధించిన కొత్త ఫోటోలో నిజంగానే చాలా సన్నబడినట్లు కనిపిస్తోంది.

కిమ్ సన్నబడిన ఫోటోలు చూసిన నెటిజన్లు వివిధ రకాల కామెంట్లు చేస్తున్నారు. ఆ దేశంలో ఆహార సంక్షోభం ఏర్పడింది. ఈ నేపథ్యంలోనే కిమ్ సన్నబడినట్లు నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. మరోవైపు తాను కావాలని తగ్గినట్లు పేర్కొంటున్నారు. మరి కొంత మంది అయితే ఆహార సంక్షోభం కారణంగా కిమ్ కు తినడానికి తిండి లేకుండా పోయిందని చెప్తున్నారు. దీంతో లావుగా ఉన్న కిమ్ కాస్త సన్నగా మారినట్లు పేర్కొన్నారు. అయితే సోషల్ మీడియాలో మరో రకమైన చర్చ కూడా నడుస్తోంది. సన్నబడిన కిమ్ తో పాటు ఆయన హెయిర్ స్టైల్ కూడా మారింది. దీనిపై చాలా మంది ఆసక్తికరంగా మాట్లాడుతున్నారు. కిమ్ ట్రెండ్ మార్చాడని కొందరు అంటే.. లేదు ఇదే ఇప్పుడు స్టైల్ అని మరి కొందరు ఛలోక్తులు విసురుతున్నారు.

అసలు జరిగిందేమిటంటే.. ఈ మధ్య కాలంలో కిమ్ బయటకు రావడం చాలా తక్కువ అయ్యింది. కొద్ది రోజుల పాటు ఆయన జాడే లేదు. కానీ ఆయన ప్రయోగించిన మిసైల్స్ మాత్రం అగ్రరాజ్యాలకు సైతం వెన్నులో వణుకు పుట్టేలా చేశాయి. ఈ నేపథ్యంలో కిమ్ అనారోగ్యం బారిన పడినట్లు చర్చలు నడిచాయి. వాటికి ముగింపు పలికేందుకు ఆ దేశ మీడియా ఆయన ఫోటోలను విడుదల చేసింది. ఇలా అయిన కిమ్ ఆరోగ్యంపై వస్తున్న కథనాలకు చెక్ పెట్టవచ్చని భావించింది. అందుకే కిమ్ సన్నబడిన ఫోటోను షేర్ చేసినట్లు పేర్కొంది ఆ దేశ మీడియా.

ఉత్తర కొరియాకు చెందిన ఈ కిమ్ అంటే చాలా దేశాలకు పడదు. దేశంలో కూడా చాలా నియంతృత్వం పోకడలతో ఈయన పాలన సాగిస్తున్నారు. కరోనా సమయంలో కిమ్ తీసుకున్న చర్యల కారణంగా ఆ దేశంలో ఆహార సంక్షోభం తలెత్తిందని నిపుణులు చెప్తున్నారు. ముందస్తు ఆలోచనలు లేకపోవడం కారణంగా ఈ సమస్య తలెత్తినట్లు అభిప్రాయపడ్డారు.


Tags:    

Similar News