తెలుగు తమ్ముళ్లకు అదిరే ఆఫర్.. నామినేషన్ వేస్తే నజరానా
ఎన్నికల్లో గెలుపు ఓటములతో పని లేకుండా.. చేతికి డబ్బులు వచ్చేలా సరికొత్త ప్లానింగ్ చేస్తున్న తెలుగుదేశం పార్టీ తీరు ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఏపీలో జరుగుతున్న పంచాయితీ ఎన్నికల్లో చాలాచోట్ల తెలుగుదేశం అభ్యర్థులు పోటీకి సముఖత వ్యక్తం చూపటం లేదు. దీనికి కారణం.. బరిలో నిలిచినా గెలుపు కష్టం కావటంతో.. ఓటమితో పాటు డబ్బులు పోగొట్టుకోవటం ఎందుకన్న ఉద్దేశంతో వెనక్కి తగ్గుతున్నారు. ఇలాంటివేళ.. ఏకగ్రీవాలతో తమ పరువు పోతుందని గ్రహించిన టీడీపీ.. సరికొత్త ఎత్తుగడను తెర మీదకు తీసుకొచ్చింది.
పార్టీ అధినేత చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరులో అత్యధిక ఏకగ్రీవాలు అవుతున్న వేళ.. అలాంటి వాటికి అడ్డుకట్ట వేసేందుకు పార్టీ అనుసరించిన వైనం అవాక్కుఅయ్యేలా చేసింది. పోటీలో ఉండేందుకు తెలుగుతమ్ముళ్లకు పార్టీ భారీ ఆఫర్ ఇచ్చినట్లుగా తెలిసింది. ఎన్నికల్లో గెలవటం తర్వాత.. ముందు పోటీ చేస్తే చాలు.. రూ.2లక్షలు ఇస్తామన్న ఆఫర్ ను తెలుగు తమ్ముళ్లకు ఇచ్చినట్లుగా తెలుస్తోంది.
పోటీ తీవ్రంగా ఉన్న చోట.. బరిలో ఉండేందుకు తమ్ముళ్లు ఇష్టపడకుంటే.. అలాంటి చోట్ల బరిలో ఉన్న వారికి రూ.3లక్షల నుంచి రూ.5లక్షల వరకు నగదు సాయాన్ని ఇస్తామని చెప్పటమే కాదు.. ఆన్ లైన్ లో వారుకోరిన వారికి సదరు మొత్తాన్ని పంపేందుకు సిద్ధమైనట్లుగా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్రంలోని మిగిలిన జిల్లాలతో పోలిస్తే.. చిత్తూరు జిల్లాలో టీడీపీకి చెందిన నేతలు ఎన్నికల బరిలో నిలవటానికి ఆసక్తి చూపటం లేదు.
దీంతో ఆందోళనకు గురైన తెలుగు తమ్ముళ్లు.. బరిలో నిలిస్తేచాలు.. నజరానా అంటూ ఆశ చూపుతున్న వైనం జిల్లా వ్యాప్తంగా ఆసక్తికరంగా మారింది. ఇదిలా ఉంటే.. పార్టీ మీద అభిమానంతో ఎవరి చొరవ లేకుండా పోటీకి దిగుతున్న తమ్ముళ్లకు మాత్రం మొండిచేయి చూపుతున్నారు. దీంతో.. పోటీకి ముందుకు రాని వారిని పట్టించుకుంటున్న పార్టీ.. అందుకు భిన్నంగా ముందుకు వచ్చిన వారికి మాత్రం భలేగా హ్యాండిస్తుందే అంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నట్లుగా చెబుతున్నారు.