మరో కొత్త పుకారు..క్యాష్ చేసుకుంటున్న వ్యాపారస్తులు!

Update: 2020-05-12 06:45 GMT

దేశంలో ప్రస్తుతం కొత్తగా పుట్టుకొచ్చిన మహమ్మారి విజృంభిస్తుంది. ఈ మహమ్మారిని కట్టడి చేయడానికి ఎన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కూడా భాదితుల సంఖ్య రోజురోజుకి పెరుగుతూనే ఉంది. ఈ తరుణంలోనే రోజుకొక పుకారు వైరల్ గా మారుతోంది. కరోనాతో కలిసి జీవించాలని .. కరోనా వల్ల లక్షల మంది మరణిస్తారని..ఎలా ఒక్కటి కాదు ఎన్నో రకాల పుకార్లు పుట్టుకు వస్తున్నాయి. అయితే ప్రభుత్వం మాత్రం ఎలాంటి పుకార్లు నమ్మవద్దు అని చెప్తున్నప్పటికీ కూడా కొన్ని చోట్ల పుకార్లు మాత్రం షికార్లు చేస్తూనే ఉన్నాయి.  

తాజాగా మరో పుకారు ఇప్పుడు షికారు చేస్తుంది. ఛత్తీస్ గఢ్ ‌లో మరో రెండు నెలల పాటు ఉప్పు దొరకదంటూ వచ్చిన పుకారు  ఒకరి నుంచి ఒకరికి చేరి, చివరికి రాష్ట్రమంతటా పాకిపోయింది. దీనితో చాలామంది  అన్ని పనులను మానుకొని, ఎంతధరకైనా సరే ఉప్పును ఇప్పుడే కొని పెట్టుకుంటే మంచిది అని భావించి ..కిరాణ షాపుల ఎదుట క్యూ కట్టి ..  బస్తాలకు బస్తాలు  కొనుక్కెళ్లారు. విషయం తెలుసుకున్న అధికార యంత్రాంగం రంగంలోకి దిగింది. రాష్ట్రంలోని రేషన్ షాపులలో - మార్కెట్లో తగినంత ఉప్పు నిల్వలు ఉన్నాయని ప్రకటించారు.

రాయ్‌పూర్ కలెక్టర్ డాక్టర్ ఎస్. భారతీదాసన్ సూచనల మేరకు ఉప్పు డీలర్ల సంస్థలపై అధికారులు దర్యాప్తు జరిపారు. పలుచోట్ల ఉప్పును అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు తేలింది. ఈ నేపధ్యంలో అధికారులు రెండు దుకాణాలకు సీలు వేశారు. కావాలనే కొంత మంది పుట్టించిన పుకార్లు అని.. దీని వల్ల కొంత మంది వ్యాపారులు బాగా లాభ పడుతున్నారని అన్నారు. అధిక ధరలకు అమ్మి క్యాష్ చేసుకోవాలనే వందంతులు వ్యాపింపజేశారని తెలిపారు.
Tags:    

Similar News