ఏపీలో దేవుడి ఆస్తులకు రక్షణేది....?
మనకు ఏ కష్టం వచ్చినా దేవుడిని తలచుకుంటాం. ఆ కష్టం నుంచి గట్టెక్కిన తర్వాత కాయో, పండో సమర్పించుకుంటాం. మరికొందరైతే దేవుడి పట్ల కృతజ్ఞతతో తులమో ఫలమో ఇస్తూ ఉంటారు. అలాంటి దేవుడి ఆస్తులకే రెక్కలు వస్తో.. ఆయన ఎవరితో మొరపెట్టుకోవాలి. ఏపీలో దేవుడి ఆస్తులకూ రక్షణ లేకుండా పోతోందని భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వందల కోట్ల విలువ చేసే దేవుడి ఆస్తులను కాజేసేందుకు సిద్ధమవుతున్నారనే ఆరోపణలు గుప్పుమంటున్నాయి. ఇప్పుడు అక్రమార్కులపై కొరడా ఝులిపించేందుకు జగన్ సర్కార్ సిద్ధమవుతోంది. ఆలయాల ఆస్తుల, సొత్తులు పక్కాదారి పట్టించిన ఆయా ఆలయాల ఈవోలపై చర్యలకు ప్రభుత్వం ఉపక్రమించింది. ఇందుకోసం ముగ్గురు అధికారులతో ఓ కమిటీని కూడా ఏర్పాటు చేశారు.
రాష్టంలో ఉన్న ప్రధాన ఆలయాల్లో దేవుడి ఆస్తిని మింగేశారు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా రూ. 951 కోట్లు హాంఫట్ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఆలయాల్లో రూ. 951 కోట్ల ఖర్చుపై అభ్యంతరాల నేపథ్యంలో ప్రభుత్వం చర్యలకు దిగితోంది. శ్రీకాళహస్తిలో 150 కోట్లు, కాణిపాకంలో 122 కోట్లు, విజయవాడ దుర్గగుడిలో 110 కోట్లు, అన్నవరంలో 70 కోట్ల ఖర్చుపై ఆడిట్ అభ్యంతరాలు వ్యక్తమైన నేపథ్యంలో ప్రభుత్వం చర్యలకు దిగుతోంది. విజయవాడలోని బ్రాహ్మణవీధిలో శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయం ఉంది. ఈ ఆలయం పక్కనే నిడుముక్కల రంగవల్లి తాయారమ్మ చారిటీస్, నిడుముక్కల సుబ్బారాయుడు ధర్మ రామానుజ కూటం, పారేపల్లి శ్రీరాములు ధర్మరామానుజ కూటం ఉన్నాయి. ఈ నాలుగు సంస్థలూ దేవదాయ శాఖ అధీనంలో ఉన్నాయి. ఈ నాలుగు సంస్థలకూ జిల్లావ్యాప్తంగా సుమారు రూ.100 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నాయి. వీటి నిర్వహణపై పలు ఆరోపణలు వస్తున్నాయి.
దేవాలయాల సొమ్ములు ఇష్టానుసారం ఖర్చు చేశారని ఆడిట్‌లో అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ఆ సమయంలో ఆయా దేవాలయాల ఈవోలపై చర్యలకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఆలయ భూములు, ఇతర వనరులను పరిరక్షించేందుకు ముగ్గురు అధికారులతో కమిటీ వేశారు. కమిటీ నివేదిక ఆధారంగా సంబంధిత అధికారులపై చర్యలు తీసుకునే అవకాశం ఉంది. దేవాలయాల ఆస్తులపై కన్నేసిన కొందరు ఆదాయాలను పక్కదారి పట్టించినట్టు తెలుస్తోంది. దేవాలయాలకు చెందిన ఖరీదైన ఆస్తులపై కొందరు రాజకీయ పలకుబడితో కన్నేసినట్లు ప్రచారం జరుగుతోంది. విజయవాడ సత్యనారాయణపురంలోని శ్రీకాశీవిశ్వేశ్వరస్వామి దేవస్థానానికి చెందిన సుమారు రూ.10 కోట్లు విలువైన 900 గజాల స్థలాన్ని గన్నవరంలోని భువనేశ్వరి పీఠం ముసుగులో ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టారనే ప్రచారం జరుగుతోంది.