వ్యాపారాలకు దేవుడి పేర్లు పెట్టుకుంటే నష్టమేంటి?
వ్యాపార సంస్థలకు దేవుడి పేర్లు పెట్టటం ఏమిటంటూ దాఖలైన ఒక ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని సుప్రీంకోర్టు కొట్టేసింది. దేవుళ్లు.. దేవుడు బొమ్మల పేర్లు పెట్టుకోవటంపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ.. ఇలా పెట్టకూడదంటూ ఒక వ్యాజ్యం దాఖలైంది.
దీనిపై విచారణ జరిపిన అత్యున్నత న్యాయస్థానం.. దేవుడు పేర్లు పెట్టుకోవటం విశ్వాసానికి సంబంధించిన విషయమని.. దేవుళ్ల పేర్లను వాణిజ్య కార్యకలాపాలకు వినియోగించకుండా ప్రజలను అడ్డుకోవటం కుదరదని తేల్చి చెప్పింది.
ఏ వ్యాపారి అయినా తన కొడుక్కి బాలాజీ అని పేరు పెట్టుకొని.. అదే పేరుతో వ్యాపార సంస్థ నిర్వహించకూడదా?.. వ్యక్తి తనకు నచ్చిన పేరును పెట్టుకోవచ్చంటూ సుప్రీం పేర్కొంది. మొత్తంగా దేవుళ్ల పేర్లను వాణిజ్య సంస్థలకు పెట్టుకోకూడదన్న పిటీషన్ ను కొట్టివేస్తూ.. సుప్రీం తీర్పునిచ్చింది.