మోడీకి ఆ నాటి భయమే.. నేటికి దూరం

Update: 2019-05-16 05:20 GMT
అవి గుజరాత్ సీఎంగా నరేంద్ర మోడీ ఉన్న రోజులు.. మూడు సార్లు వరుసగా ముఖ్యమంత్రిగా ఉన్నారు.. మోడీ హయాంలో గుజరాత్ లో గోద్రా అల్లర్లు సహా మైనార్టీలపై ఎన్నో దాడులు జరిగాయి. హత్యలు చోటుచేసుకున్నాయి. దీని వెనుక మోడీ ఉన్నారన్న విమర్శలున్నాయి. ఒకవర్గం వారినే మోడీ కాపుకాశారన్న విమర్శ ఉంది. అయితే మొదటి సారి మోడీ 2007లో ఓ స్వతంత్ర మీడియా సీఎన్ ఎన్ ఐబీఎన్ అనే అంతర్జాతీయ సంస్థకు ఇంటర్వ్యూ ఇవ్వడానికి వచ్చాడు. ఇంటర్వ్యూ చేసేది పేరు మోసిన కరణ్ థాపర్ అనే బీకర జర్నలిస్టు.. ఆయన ప్రశ్నలకు మోడీ ఇంటర్వ్యూ మధ్యలోనే వదిలేసి వెళ్లిపోయాడు. మోడీచేత నీళ్లు తాగించాడు.అప్పట్లో అది తీవ్ర చర్చనీయాంశమైంది. అప్పటి నుంచి ఇప్పటివరకు ఏ స్వతంత్ర జర్నలిస్టును మోడీ దగ్గరకు రానీయడం లేదు.

భారతదేశానికి మోడీకంటే ముందు మన్మోహన్ ప్రధానిగా ఉండేవారు. ఆయన ఏ దేశానికి పర్యటనకు వెళ్లినా మీడియా బృందాన్ని తీసుకెళ్లేవారు. విమానంలో మీడియా మిత్రులకు ఇంటర్వ్యూ ఇచ్చేవారు. వారు ఎంతటి క్లిష్ట ప్రశ్నలు వేసినా కూడా దానికి ఓపిగ్గా సమధానం ఇచ్చేవారు. తన ప్రభుత్వంపై విమర్శలకు తడబడకుండా మన్మోహన్ జవాబులు ఇచ్చేవారు. విమర్శలను కూడా తిప్పికొట్టగల సామర్థ్యం ఆయన సొంతం..

కానీ మోడీ వచ్చాక ప్రజాస్వామ్య వ్యవస్థలో తీవ్ర మార్పులు వచ్చాయి. ఈ ఐదేళ్లలో మోడీ దాదాపు 40 దేశాలు చుట్టివచ్చారు. ఇప్పటివరకు ప్రధానులుగా చేసిన వారందరూ మీడియాను వెంటతీసికెళితే.. ఒక్క మోడీ మాత్రమే మీడియాను తీసుకెళ్లలేదు. తన అప్ డేట్స్ అన్నీ ట్విట్టర్ లోనే చూసుకోమనేవారు. మీడియాను విదేశీ పర్యటనలకు దూరం పెట్టిన మొదటి ప్రధాని మోడీనే..

మోడీ మీడియాను పక్కనపెట్టడానికి కారణం ఉంది. అది గుజరాత్ సీఎంగా ఉన్న సమయంలో కరణ్ థాపర్ ఇంటర్వ్యూనే. అందుకే ఇప్పుడు ప్రధాని అయ్యాక కూడా బీజేపీ కొమ్ము కాసే రిపోర్టర్లు.. అక్షయ్ కుమార్ లాంటి బాలీవుడ్ భజన హీరోలకు మాత్రమే  మోడీ ఇంటర్వ్యూలిస్తున్నాడు. మిగతా కరుడుగట్టిన జర్నలిస్టులను దగ్గరకు రానీయడం లేదు. ఇలా మీడియా అంటే భయం, ఆందోళన కలుగడానికి మోడీని కరుణ్ థాపర్ చేసిన ఇంటర్వ్యూ నుంచే మొదలైందని ఢిల్లీ వర్గాల్లో చర్చ జరుగుతుంటుంది. అదిప్పటికీ కొనసాగుతోంది.


Tags:    

Similar News