ఎన్నికల షెడ్యూల్ పై నిమ్మగడ్డ క్లారిటీ?

Update: 2020-09-05 14:30 GMT
ఏపీలో ఎన్నికల సందడి మొదలు కాబోతోందని.. స్థానిక సంస్థల ఎన్నికలకు ఈసీ సమాయత్తమవుతోందన్న ప్రచారం ఈరోజు సోషల్ మీడియాలో ఉవ్వెత్తున సాగింది. ఈ ప్రచారం నిజమనుకొని గ్రామాల్లో పోటీచేసే అభ్యర్థులు అప్పుడే ప్రచారం కోసం అంతా సెట్ చేసుకున్నారు.. కానీ ప్చ్.. బ్యాడ్ లక్.. ఇదంతా వట్టి ప్రచారం అని తేటతెల్లమైంది.

ఏపీలో పంచాయితీ, మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి వాట్సాప్ - సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న షెడ్యూల్ పై తాజాగా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ క్లారిటీ ఇచ్చారు.ఆ షెడ్యూల్ పూర్తిగా అవాస్తవమని.. ఎన్నికల కమిషనర్ గా తాను ఎలాంటి షెడ్యూల్ విడుదల చేయలేదని స్పష్టం చేశారు. అది కేవలం తప్పుడు ప్రచారం అని క్లారిటీ ఇచ్చారు. అందులో వాస్తవం లేదని నిమ్మగడ్డ తెలిపారు.

అయినా ఈ ఎన్నికల ప్రకటనతో నిమ్మగడ్డకు .. జగన్ సర్కార్ మధ్య ఫైట్ మొదలైంది. జగన్ సర్కార్ ప్రకటించిన స్థానిక ఎన్నికలను నిమ్మగడ్డ కరోనాతో వాయిదా వేశారు.దీనిపై సీరియస్ అయిన జగన్ సర్కార్ ఏకంగా నిమ్మగడ్డను తొలగించింది. ఆ వివాదం అంతా కోర్టుల చుట్టు తిరిగి ఇటీవలే నిమ్మగడ్డ మళ్లీ పునర్ నియామకం అయ్యారు.

సో అంతా ఎన్నికల గురించే ఈ ప్రహసనం సాగింది. మరి ఇంత తొందరగా ఏపీలో ఎన్నికలు నిమ్మగడ్డ ప్రకటిస్తారా అన్న సందేహాలు కూడా అందరిలోనూ కలిగాయి.. ఇప్పుడు నిమ్మగడ్డ ప్రకటనతో అదే నిజమని ఆశావహులంతా నిట్టూర్చారు.

    

Tags:    

Similar News