ఏపీ ప్రజానికాన్ని నిమ్మగడ్డ మోసం చేస్తున్నారా .. అసలేమైంది ?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ రాష్ట్రంలో నివసించడం లేదని, కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఉద్దేశపూర్వకంగా మోసం చేస్తూ ప్రతి నెలా ఇంటి అద్దె అలవెన్స్ పొందుతున్నారని సమాచార హక్కు ఉద్యమ ఐక్య వేదిక , గవర్నర్ విశ్వభూషణ్ కు ఫిర్యాదు చేసింది. నిమ్మగడ్డపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని విజ్నప్తి చేసింది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా నిమ్మగడ్డ ప్రభుత్వం నుంచి పొందుతున్న వేతన వివరాలను సమాచార హక్కు చట్టం ద్వారా తీసుకున్న వేదిక ప్రతి నిధులు.. ఆ వివరాల కాపీలను ఫిర్యాదుకు జత చేసి గవర్నర్ కి పంపింది.
గవర్నర్‌కు ఫిర్యాదు చేసిన తర్వాత ఆ వేదిక ప్రతినిధులు జంపాన శ్రీనివాస గౌడ్, కేఎండీ నస్రీన్ బేగంలు ఆ వివరాలను సోమవారం ఒక ప్రకటన రూపంలో మీడియాకు విడుదల చేశారు. రాజ్యాంగబద్ధమైన ఉన్నత స్థాయి పదవులలో ఉన్న వ్యక్తులు అధికారులకు, ప్రజలకు ఆదర్శంగా ఉండాలి. తాము ఆర్టీఐ చట్టం ద్వారా పొందిన వివరాల ప్రకారం.. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రతి నెలా రూ. 3,19,250 జీతం పొందుతున్న నిమ్మగడ్డ రమేష్ అసలు రాష్ట్రంలోనే నివాసం ఉండడం లేదు. రాజధాని హైదరాబాద్ నుంచి అమరావతికి తరలివచ్చినప్పటి నుంచి, ఇక్కడ సరైన సౌకర్యాలు లేనప్పటికీ రాష్ట్ర గవర్నర్, ముఖ్యమంత్రి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, హైకోర్టు న్యాయమూర్తులు, ఇతర ఉన్నత స్థాయి అధికారులు విజయవాడ, గుంటూరు పరిసర ప్రాంతాల్లోనే నివాసం ఉంటున్నారు.
రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కార్యాలయం కూడా హైదరాబాద్ నుంచి విజయవాడకు మారినా ఎన్నికల కమిషనర్ మాత్రం హైదరాబాద్ నుంచి విజయవాడకు ఇప్పటివరకు మారలేదని తెలిపారు. హైదరాబాద్ లో ఉంటున్నా.. ప్రతి నెలా ఇక్కడ ఇంటి అద్దె అలవెన్స్ ను తీసుకుంటున్నందున, ఇప్పటి వరకు ఆయనకు చెల్లించిన ఆ అలవెన్స్ మొత్తాన్ని రికవరీ చేయాలి. ప్రభుత్వాన్ని మోసగించి ఇంటి అద్దె పొందుతున్న నిమ్మగడ్డ పై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కోరారు.