ఎన్నికల వేడి రగించడం వెనుక వైసీపీ వ్యూహం ఏంటి...!
రకరారు.. మహానుభావులు.. అన్నట్టుగా రాజకీయాల్లోనూ నాయకులు ఊరికేనే కామెంట్లు చేయరు. ఏదో వ్యూహం ఉండే ఉంటుంది. ఇదే ఇప్పుడు ఏపీలోనూ వినిపిస్తోంది. ఎందుకంటే.. సార్వత్రిక సమరానికి ఏడాదికిపైగానే సమయం ఉండగా.. ఇప్పుడే రాష్ట్రంలో ఎన్నికల వేడి రాజుకుంది. నిజానికి ఎన్నికల వేడి రాజుకోలేదు.. రాజేశారనే చెప్పాలి. అది కూడా అధికార పక్షం వైపు నుంచే అనే కామెంట్లు వినిపిస్తున్నా యి.
నిజానికి ఎప్పుడూ కూడా.. ప్రతిపక్షం వైపు నుంచి ఎన్నికలకు ముందు ఎన్నికల వేడి ఉంటుంది. అయి తే.. అనూహ్యంగా ఇప్పుడు ఏపీ అధికార పార్టీ వైపు నుంచి వేడి రాజుకుంది. ఇటీవల ఎక్కడ సభ పెట్టినా.. సీఎం జగన్.. అక్కడ ఏ కార్యక్రమం కోసం వెళ్లారో.. దాని గురించి చాలా చాలా తక్కువగా రెండు మూడు వాక్యాల్లో తేల్చేస్తున్నారు. ఇక, అక్కడ నుంచి తన సొంత స్వోత్కర్షను 50 పర్సెంట్, ప్రతిపక్షాలపై 100 పర్సెంట్ విరుచుకుపడుతున్నారు.
ముఖ్యంగా చంద్రబాబు-పవన్‌లపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. తాజాగా జరిగిన అనకాపల్లి సభలోనే కాదు.. గతంలో జరిగిన కమాలపురం సభలో కూడా చంద్రబాబు, పవన్‌పై తీవ్ర విమర్శలు చేశారు. విమర్శ లతోపాటు.. ఫక్తు ఎన్నికల సమయంలో కనిపించే ప్రసంగాలు కూడా చేశారు. మీబిడ్డను ఆశీర్వదించండి .. 175కి 175 సీట్లలో గెలిపించండి! అని ప్రజలకు పిలుపునిచ్చారు.
మరి దీనికి కారణం ఏంటి? ఎందుకు? అధికార పార్టీనే ఎందుకుఇంతగా రెచ్చిపోతోంది? అంటే.. దీనికి ఏకైక కారణం.. ప్రతిపక్షాలు చేస్తున్న ప్రభుత్వ వ్యతిరేక ప్రచారాన్ని చర్చకు రాకుండా చేయడమే వ్యూహంగా ఉందని అంటున్నారు పరిశీలకులు. ఎందుకంటే.. ఎన్నికలకు సంబంధించి ఎలాంటి కామెంట్లు చేసినా.. అవే మీడియాలో హైలెట్ అవుతాయి. సో.. దీంతో చంద్రబాబు విమర్శించినా.. మరో నేత దుయ్యబట్టినా.. అవన్నీ.. కనిపించవని. అందుకే జగన్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారని.. ఎన్నికల వేడిని రాజేస్తున్నారని అంటున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.