కొత్త వెహికిల్ కొన్నోళ్ల తలనొప్పిని తీర్చిన కేసీఆర్ సర్కార్

Update: 2016-05-03 09:43 GMT
తెలంగాణ సర్కారు తీసుకున్న తాజా నిర్ణయంతో తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా వెహికిల్ కొన్న వారికి ఓ పెద్ద తలనొప్పి తీరనుంది. ఇప్పటివరకూ ఏదైనా కొత్త వాహనం కొనుగోలు చేస్తే.. దాని పర్మినెంట్ రిజిస్ట్రేషన్ కార్యక్రమం పెద్ద తలనొప్పిగా ఉండేది. పర్మినెంట్ రిజిస్ట్రేషన్ కోసం వాహనదారుడు విధిగా ఆర్టీవో కార్యాలయానికి వెళ్లటం.. అక్కడ చలానా కట్టటం.. క్యూలో నిలుచొని వాహన పరీక్షను పూర్తి చేయించటం ఒక ప్రహసనంగా ఉంటుంది.

దీనికి చెక్ చెబుతూ తెలంగాణ సర్కారు సరికొత్త నిర్ణయం తీసుకుంది. దీని ప్రకారం.. ఇకపై కొత్త వాహనం కొనుగోలు చేసిన వారు ఎవరూ ఆర్టీవో ఆఫీసుకు వెళ్లాల్సిన అవసరం ఉండదు. వాహనం కొన్న షోరూంలోనే టెంపరరీ రిజిస్ట్రేషన్ మాదిరే.. పర్మినెంట్ రిజిస్ట్రేషన్ ను కూడా పూర్తి చేసేలా ఒక విధానాన్ని రూపొందించారు. దీంతో.. షోరూంలోనే పర్మినెంట్ రిజిస్ట్రేషన్ కు సంబంధించిన ఛార్జీల్ని చెల్లించటం ద్వారా ఆర్టీవో కార్యాలయానికి వెళ్లే తలనొప్పి తప్పనుంది.

పర్మినెంట్ రిజిస్ట్రేషన్ కోసం ఆర్టీవో ఆఫీసుకు వెళ్లే వాహనదారులు ఒక రోజు తప్పనిసరిగా వేస్ట్ అయ్యే పరిస్థితి. తాజాగా తీసుకున్న నిర్ణయం కారణంగా.. ఆర్టీవో ఆఫీసుకు వెళ్లి.. అక్కడ గంటలు గంటలు వెయిట్ చేసే తిప్పలు తప్పనున్నాయి.
Tags:    

Similar News