కర్ణాటక కథ మొదటికి.. భారీ ట్విస్ట్

Update: 2019-07-19 08:58 GMT
కర్ణాటక రాజకీయ సంక్షోభం ఆ రాష్ట్ర గవర్నర్ ఎంట్రీతో ఇప్పుడు సీన్ మొత్తం మారిపోయింది. ప్రభుత్వాన్ని బలపరీక్షలో కూల్చేసి గద్దెనెక్కుదామని ఆశించిన బీజేపీకి ఇప్పుడు అదే గవర్నర్ చేసిన తప్పు పెనుశాపంగా మారింది..

కర్ణాటక బీజేపీ నేతలు గవర్నర్ వజుభాయ్ వాలా శుక్రవారం మధ్యాహ్నం 1.30 గంటలలోపు బలపరీక్ష నిర్వహించాలని అసెంబ్లీ స్పీకర్ కు లేఖ రాయడం.. సీఎం కుమారస్వామిని ఆదేశించడం దుమారం రేపింది. ఈ ఒక్క నిర్ణయంతో గవర్నర్ వ్యవహార శైలి వివాదానికి కేంద్ర బిందువైంది. బీజేపీ పాలిట శాపంగా మారుతోంది.

కర్ణాటక గవర్నర్ వజుభాయ్ వాలా ఈరోజు మధ్యాహ్నం 1:30 నువ్వు కర్ణాటక అసెంబ్లీలో పరీక్ష చేసుకోవాలి అని ఆదేశించారు. అయితే దీనిని వ్యతిరేకిస్తూ సీఎం కుమారస్వామి, స్పీకర్ సురేష్ కుమార్ గవర్నర్ ఆదేశాలను ధిక్కరించారు.  శాసనసభలో జోక్యం చేసుకునే హక్కు గవర్నర్ కు లేదంటూ బల పరీక్షను వాయిదా వేయడం సంచలనంగా మారింది.

కర్ణాటక గవర్నర్ ఇలా శాసనసభ వ్యవహారాల్లో జోక్యం చేసుకునే హక్కు లేదని నిరసిస్తూ తాజాగా కాంగ్రెస్ పార్టీ సుప్రీం కోర్టులో పిటీషన్ వేసింది.  ఈ పిటీషన్ ను సుప్రీం కోర్టు విచారణకు స్వీకరించడంతో కథ అంతా మళ్లీ మొదటికి వచ్చింది.

ఇప్పుడు ఈ వ్యవహారం కర్ణాటకలో కుమారస్వామి ప్రభుత్వానికి  వరంలా మారింది. సుప్రీం కోర్టు తీర్పును ఇచ్చేవరకు బలపరీక్షను వాయిదా పడే అవకాశాలున్నాయి. ప్రస్తుతం కర్ణాటకలో మైనార్టీలో ఉన్న కుమారస్వామి ప్రభుత్వానికి ఇది గొప్ప ఊరటగా చెప్పవచ్చు.

బిజెపి గవర్నర్ తో లేఖ రాయించి తప్పు చేయడం వల్ల ఇప్పుడు కర్ణాటకలో బలపరీక్ష వాయిదా పడే అవకాశాలు నెలకొన్నాయి.  కర్ణాటకలోని కుమారస్వామి సంకీర్ణ ప్రభుత్వ కూడా ఇదే అదునుగా బలపరీక్షను వాయిదా వేయాలని చూస్తోంది. ఇప్పుడు గవర్నర్ జోక్యంతో వారికి అందివచ్చిన అవకాశం ఏర్పడింది.



Tags:    

Similar News