సెకండ్ వేవ్ కు చలి.. వేసవి కాలాలతో పని లేదట
కరోనా మహమ్మారి గురించి ప్రపంచానికి పెద్దగా పరిచయం లేని వేళలో నిజాల కంటే కూడా అంచనాలే ఎక్కువగా ప్రచారాల్లోకి వచ్చాయి. ఇందులో ముఖ్యమైనది.. చాలామంది తప్పులో కాలేసింది.. చల్లటి ప్రాంతాల్లో వైరస్ విరుచుకుపడుతుందని.. వేడి ప్రాంతాల్లో దీని ప్రభావం పెద్దగా ఉండదని. అయితే.. తర్వాతి కాలంలో చోటు చేసుకున్న పరిణామాల్ని చూసిన వారికి.. తాము వేసిన అంచనాలన్ని తప్పుగా తేలిపోయాయి.
ఎందుకంటే.. భారత్ లో కరోనా వీరంగం వేసింది మండు వేసవిలోనే అన్న విషయాన్ని మర్చిపోకూడదు. మండే ఎండలో వైరస్ తీవ్రత లేకుంటే.. వ్యాప్తి జోరు.. మే.. జూన్ లలోనే ఎక్కువైందన్నది మర్చిపోకూడదు. కరోనాకు వేసవి.. చలికాలాలతో సంబంధం లేదన్న నిజాన్ని తాజాగా గుర్తించారు. ప్రపంచ వ్యాప్తంగా 13 లక్షల జన్యు విశ్లేషణలు నిర్వహించారు. ఈ విశ్లేషణలో తేలిన ముఖ్యమైన అంశాల్లో ఒకటి.. వైరస్ కు ఎండ.. వానా.. చలికాలాలతో సంబంధం లేదు. అంతేకాదు.. కరోనా వైరస్ తన రూపాన్ని మార్చుకుంటోందని తేల్చాయి. అయితే.. రూపం మార్చుకున్నాక.. దాని తీవ్రత తగ్గుతుందా? పెరుగుతుందా? అన్న అంశంపై మాత్రం స్పష్టత లేదని చెప్పాలి.
ఫస్ట్ వేవ్ తో పోలిస్తే.. సెకండ్ వేవ్ తీవ్రత ఎక్కువని పలువురు.. కాదు తక్కువని కొందరు వాదనలు వినిపిస్తున్నాయి. అయితే.. ఇందులో నిజం ఏమంటే.. ఫస్ట్ వేవ్ తో పోలిస్తే.. సెకండ్ వేవ్ లో మరణాలు తక్కువయ్యే అవకాశం ఉంటుంది. రోగ తీవ్రత తక్కువగా ఉండే వీలుంది. కారణం.. ఫస్ట్ వేవ్ టైంలో కరోనా చికిత్స మొత్తం చాలా కొత్త. వైద్యులకు అవగాహన లేదు. ఎప్పటికప్పుడు.. ప్రయోగాలు చేయటం.. వివిధ రకాల సమస్యలతో వచ్చే పేషెంట్లను డీల్ చేయటం ఒక సమస్యగా ఉండేది.
కానీ.. ఇప్పటికి కరోనా వైరస్ సోకిన వారికి ఎలాంటి వైద్యం చేయాలన్న అంశంపై అవగాహన పెరిగింది. క్రిటికల్ కేసుల్ని ఎలా డీల్ చేయాలి? తీవ్రత తక్కువగా ఉన్న వారి విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలన్న దానిపై క్లారిటీ వచ్చేసింది. మొదట్లో కరోనా పాజిటివ్ అయితే చాలు.. తీసుకెళ్లి ఐసోలేషన్ గదిలో ఉంచేసేవారు. వారికి తీవ్రత ఏ మాత్రం లేకున్నా.. ముందస్తు జాగ్రత్తలు బోలెడన్ని ఉండేవి. తర్వాతి కాలంలో కేసుల సంఖ్య భారీగా పెరిగిన వేళలో.. తీవ్రత ఎక్కువగా ఉన్న వారిని మాత్రమే ఆసుపత్రుల్లో చేర్చటమే తప్పించి మిగిలిన వారిని ఇళ్లకే పరిమితం చేయటం తెలిసిందే. ఈ నేపథ్యంలో సెకండ్ వేవ్ కు కాలాలతో పని లేదన్న నిజంతో పాటు.. ఫస్ట్ వేవ్ తో పోలిస్తే.. సెకండ్ వేవ్ తీవ్రత తక్కువ ఉండే వీలుంది.
అయితే.. నిబంధనల్ని పక్కన పెట్టేసి ఇష్టారాజ్యంగా తిరగటం వల్ల కేసుల సంఖ్య ఫస్ట్ వేవ్ కంటే ఎక్కువగా వ్యాప్తి చెందే వీలుంది. అది కూడా.. చాలా వేగంగా. సో.. ఫస్ట్ వేవ్ తో పోలిస్తే.. సెకండ్ వేవ్ వేళ.. ఒళ్లు దగ్గర పెట్టుకొని జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే.. మన చుట్టూ ఉండే వారిలో అప్రమత్తత తక్కువగా ఉండే అవకాశం ఉన్నందున.. వైరస్ వ్యాప్తి ముప్పు ఎక్కువగా ఉంటుందన్నది మర్చిపోకూడదు.