తెలంగాణ కాంగ్రెస్ కు కొత్త ఇన్ చార్జి.. పీసీసీ మార్పేనా?
అసమ్మతి రాజేసిన సీనియర్లకు చెక్ చెబుతూ కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ కాంగ్రెస్ పార్టీని ప్రక్షాళన చేశారు. పార్టీలో అలజడి రేపిన గులాం నబీ ఆజాద్ తోపాటు సీనియర్ ఖర్గేను పక్కనపెట్టి కొత్త టీంను ఏర్పాటు చేశారు. పూర్తిగా రాహుల్ టీంగా దీన్ని అభివర్ణిస్తున్నారు.
ఇక ఈ క్రమంలోనే తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ చార్జిని కూడా మార్చేశారు. తమిళనాడుకు చెందిన యంగ్ డైనమిక్ ఎంపీ మణికం ఠాగూర్ (45)ను తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ చార్జిగా నియమించారు. ప్రస్తుత ఇన్ చార్జి కుంతియాను పక్కనపెట్టారు.
మణికం ఠాగూర్ తమిళనాడులోని విరుదునగర్ లోక్ సభ ఎంపీగా ఉన్నారు. రాహుల్ కు నమ్మిన బంటు. పైగా యువకుడు. త్వరలోనే తెలంగాణ కాంగ్రెస్ ఇన్ చార్జిగా బాధ్యతలు చేపడుతారు.
కాంగ్రెస్ విద్యార్థి విభాగం ఎన్ఎస్.యూ.ఐ నుంచి మణికం ఠాగూర్ అంచెలంచెలుగా ఎదిగారు. ఎన్ఎస్.యూ.ఐ ఆల్ఇండియా వైస్ ప్రెసిడెంట్ గా.. ఇండియన్ యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రెటరీగా.. సెంట్రల్ ఎలక్షన్ అథారిటీ చైర్మన్ గా పలు కీలక బాధ్యతలను నిర్వర్తించారు.
ఇక తెలంగాణకు కొత్త ఇన్ చార్జి నియామకంతో కొత్త పీసీసీ చీఫ్ నియామకం ఎప్పుడున్న చర్చ మొదలైంది. మణికం ఠాగూర్ తెలంగాణ రాజకీయాలపై పూర్తి అవగాహన తెచ్చుకున్నాక ఏఐసీసీకి ఒక రిపోర్ట్ ఇచ్చే అవకాశం కనిపిస్తోంది.
త్వరలోనే మణికం పార్టీ సీనియర్లు, జిల్లాల అధ్యక్షులతో మాట్లాడే అవకాశం ఉంది. ఆ తర్వాత తెలంగాణ పీసీసీ చీఫ్ మారే అవకాశం కనిపిస్తోంది. రాహుల్ టీంలో భాగంగానే ఠాగూర్ నియామకం అయినట్టు తెలుస్తోంది. దీంతో కాంగ్రెస్ యువనేతలకు ప్రాధాన్యం పెరిగినట్టు తెలుస్తోంది. రేవంత్ రెడ్డికి మార్గం సుగమం అయినట్లే కనిపిస్తోంది.