అమెరికాలో కరోనా విలయతాండవం!

Update: 2020-07-05 05:26 GMT
అగ్రరాజ్యం అమెరికాలో కరోనా విలయతాండవం చేస్తోంది. వైరస్ ధాటికి చిగురుటాకులా వణుకుతోంది. ఇప్పటివరకు కనీవినీ ఎరుగని స్థాయిలో కరోనా కల్లోలం కొనసాగుతోంది. పశ్చిమ, దక్షిణ రాష్ట్రాల్లో కరోనా మహమ్మారి శరవేగంగా విస్తరిస్తోంది. పాజిటివ్ కేసులు ఇబ్బడిముబ్బడిగా పెరుగుతున్నాయి.

తాజాగా గత 24 గంటల్లో అమెరికాలో 57,683 పాజిటివ్ కేసులు నమోదు కావడం ఒక రికార్డ్ గా చెప్పవచ్చు. దేశంలో ఒక్కరోజులో ఇన్ని కేసులు బయటపడడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం. ఇంత భారీ స్థాయిలో వ్యాప్తి వైరస్ వ్యాప్తి  ఇదే ప్రథమం.

కరోనా కారణంగా అమెరికాలో నిన్న 728మంది మరణించారు. శనివారం రాత్రి నాటికి అమెరికాలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 29,12,166కు చేరింది. మరణాల సంఖ్య 1,32,196కు చేరింది.

జూలై 4 అమెరికా స్వాతంత్ర్య దినోత్సవ సంబరాలే అమెరికా కొంప ముంచాయని.. ప్రజలందరూ వేడుకల్లో మునిగితేలడమే వ్యాప్తికి కారణమని అంటున్నారు. కరోనా వ్యాప్తితో అమెరికాలో ఈ వీకెండ్ లో రెస్టారెంట్లు, బార్లు, వీధులు, బీచ్ లు నిర్మానుష్యంగా మారాయి.
Tags:    

Similar News