కంగ్రాట్స్ అమెరికా ఓకే.. కంగ్రాట్స్ వరల్డ్ ఏంది ట్రంప్?
ప్రపంచానికి పెద్దన్న అమెరికాకు దేశాధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న డొనాల్డ్ ట్రంప్ హయాంలో కామెడీకి .. వివాదానికి ఏ మాత్రం కొదవ ఉంటేది కాదు. ప్రతి విషయాన్ని తనకు అనుకూలంగా మలుచుకోవటంలో ఆయనకు ఆయనే సాటి. ఈ రోజు అమెరికాలో ఫైజర్ వ్యాక్సిన్ పంపిణీ షురూ అయ్యింది. దీంతో.. కరోనా కారణంగా విలవిలలాడుతున్న అమెరికాకు కొంతమేర సాంత్వన కలగటం ఖాయం. బ్రిటన్.. దుబాయ్.. జర్మనీ లాంటి దేశాల తర్వాత అమెరికాకు చేరింది. అత్యవసర అవసరాల నిమిత్తం వాడుకోవచ్చంటూ వ్యాక్సిన్ సామాన్య ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చారు.
కొద్దిరోజుల క్రితమే బ్రిటన్ లో వ్యాక్సిన్ విడుదలైంది. అక్కడి ప్రజలకు పెద్ద ఎత్తున పంపిణీ చేస్తున్నారు. ఈ రోజు అమెరికా కాలమానం ప్రకారం సాయంత్రం వేళలో టీకా వేయించుకోవటానికి ముందుకు వచ్చిన వారికి వ్యాక్సిన్ వేసేశారు. అమెరికాలో మొట్టమొదటి వ్యాక్సిన్ ను క్వీన్స్ లోని లాంగ్ ఐలాండ్ యూదు కాలేజీకి చెందిన నర్సుకు తొలి డోసును అందించారు. తొలి టీకా తనకు దక్కినందుకు ఆమె చాలా సంతోషానికి గురయ్యారు. తన ఆనందాన్ని పంచుకునే ప్రయత్నం చేస్తున్నారు.
వ్యాక్సిన్ రావటంతో అమెరికా చరిత్రలో బాధాకరమైన సమయం ముగింపునకు ఇదో నాందిగా పలువురు అభివర్ణిస్తున్నారు. టీకా వచ్చినప్పటికీ మాస్కకు ధరించటం.. భౌతిక దూరాన్ని పాటించాల్సిందేనని అధికారులు చెబుతున్నారు. ఇదిలా ఉంటే ఫైజర్ సీఈవో అల్బెర్ట్ బోర్లా మాట్లాడుతూ.. తను కూడా టీకా తీసుకుంటానని పేర్కొన్నారు. అలా చేస్తే వ్యాక్సిన్ మీద మరింత నమ్మకం కలిగేలా చేస్తుందన్నారు.
ఇదిలా ఉంటే.. కరోనా వ్యాక్సిన్ వచ్చిన వేళ ట్రంప్ స్పందించారు. సోషల్ మీడియాలో ట్వీట్ చేశారు. తమ దేశంలో తొలి వ్యాక్సిన్ పంపిణీ ప్రారంభించినట్లుగా పేర్కొన్న ఆయన.. కంగ్రాట్స్ అమెరికా.. కంగ్రాట్స్ వరల్డ్ అంటూ ట్వీట్ చేశారు. కామెడీ కాకుంటే.. అమెరికాకు చాలా ముందే బ్రిటన్ లో కోవిడ్-19 వ్యాక్సినేషన్ ప్రజలకు వేసిన వేళ.. తానేదో ప్రపంచాన్ని ఉద్దరిస్తున్నట్లుగా ట్రంప్ ట్వీట్ పైన పంచ్ వ్యాఖ్యలు చేస్తున్నారు.