‘నేను లేనిదే తెలంగాణ లేదు’.. వామ్మో ఇవేం బడాయి మాటలు కేసీఆర్?
సర్వ దరిద్రాలకు కారణం ‘నేను’ అన్న మాటే. అదొక్కటే లేకుంటే చాలు.. చాలా అవలక్షణాలకు దూరమయ్యే అద్భుతమైన అవకాశం ఉందన్న విషయాన్ని అస్సలు మర్చిపోకూడదు. ఎంత సాధించినా.. మరెంత సొంతం చేసుకున్నా.. ‘నేను’.. ‘నాది’.. లాంటి మాటలకు దూరంగా ఉంటో.. ఆ లెక్కే వేరుగా ఉంటుంది. మిగిలిన రంగాల వారితో పోలిస్తే ప్రజాసేవలో ఉన్న వారి నోటి నుంచి ఈ రెండు మాటలు అస్సలు రాకూడదు. కానీ.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తన గొప్ప గురించి తాను చెప్పుకోకపోతే.. ఎవరు చెబుతారని ఫీల్ అయినట్లున్నారు. అందుకే కాబోలు తాజా బహిరంగ సభలో ఆయన మాటల్ని వింటే.. అతిశయోక్తి అంటే ఇదేకదా? అన్న భావన కలుగక మానదు.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కేసీఆర్ కీలకమని చెప్పాలి. ఆయన లేకుంటే తెలంగాణ లేదనేది అతిశయోక్తిగా చెప్పక తప్పదు. ఎందుకంటే.. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ఆయన ఎంత కీలకమో.. ఆ అడుగులు పడటానికి చాలామంది చేసిన ప్రయత్నాల్ని మర్చిపోలేం. టీడీపీ అధినేత చంద్రబాబు కానీ తెలంగాణకు అనుకూలంగా లేఖ రాయకున్నా.. సోనియాగాంధీ తెలంగాణ ఇవ్వకూడదని డిసైడ్ అయినా.. ఇవాల్టి తెలంగాణ సాధ్యమయ్యేదా? అన్నది ప్రశ్న.
ఇక్కడ చెప్పేదేమంటే.. తెలంగాణ సాధన ఏ ఒక్క వ్యక్తికో క్రెడిట్ ఇవ్వటం సరికాదన్నదే తప్పించి.. బాబు.. సోనియాలు గొప్పవాళ్లు.. వారి కారణంగా మాత్రమే తెలంగాణ వచ్చిందని చెప్పటం లేదు. అన్ని కుదిరాయి.. కాలం కలిసి వచ్చింది.. అందరి ప్రయత్నాలు ఫలించి.. తెలంగాణ సాధ్యమైందన్నది అస్సలు మర్చిపోకూడదు. అందుకు భిన్నంగా నేను లేకుంటే తెలంగాణ లేదన్న మాట అతిశయోక్తి మాత్రమే కాదు.. బడాయి మాటలుగా చెప్పక తప్పదు.
తాజాగా సిద్దిపేట పర్యటనలో భాగంగా పలు కార్యక్రమాల్లో పాల్గొన్న ముఖ్యమంత్రి కేసీఆర్.. అక్కడ ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతూ.. ‘‘సిద్దిపేట పేరులోనే బలమున్నది. ఇది మామూలు ప్రాంతం కాదు. తెలంగాణను సిద్ధింపజేసిన గడ్డ. సిద్ధిపేట లేకపోతే కేసీఆర్ లేడు. కేసీఆర్ లేనిదే తెలంగాణ లేదు’’ అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇదంతా చూస్తుంటే.. కేసీఆర్ మాటల్లో అతిశయోక్తి ఎక్కువైందన్న భావన కలుగక మానదు. తన ఊళ్లో.. తన గొప్పతనం గురించి కేసీఆర్ కంటే మరెవరి నోటి నుంచి వచ్చి ఉంటే బాగుండేది కానీ.. ఆయన నోటి నుంచి రావటం మాత్రం సూట్ కాలేదని చెప్పక తప్పదు. వ్యక్తులే సమస్తమని.. వేల పుస్తకాలు చదివిన కేసీఆర్ కు అనిపించటం ఏమిటి?