ప్లీజ్ ఈ పాల్.. ఆయన కాదు.. కరోనా మీద ఏం చెప్పారంటే?

Update: 2020-12-16 08:30 GMT
ఇప్పటికే పలు దేశాల్లో మహమ్మారికి టీకా అందుబాటులోకి వచ్చేసింది. రష్యా.. బ్రిటన్.. దుబాయ్ తో పాటు పలు చిన్న దేశాలే కాదు.. అగ్రరాజ్యమైన అమెరికాలోనూ తాజాగా వ్యాక్సిన్ ఇస్తున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే.. ఇండియాలో ఇంకా వ్యాక్సిన్ అమలుపై నిర్ణయం తీసుకోలేదు. ఇప్పటివరకు ప్రభుత్వం చెప్పిన దాని ప్రకారం జనవరి 15 నుంచి మాత్రమే అందరికి అందుబాటులోకి రానుంది. ఇదిలా ఉంటే.. తాజాగా కోవిడ్ వ్యాక్సిన్ కు సంబంధించి నీతి ఆయోగ్ (హెల్త్) విభాగం సభ్యులు డాక్టర్ వీకే పాల్ (మనకు సుపరిచితులైన పాల్ కాదండోయ్) కీలక ప్రకటన చేసింది.

ఒకరకంగా చెప్పాలంటే వ్యాక్సిన్ కు సంబంధించిన కీలక అప్డేట్ గా చెప్పాలి. ఈ వారంలో మరో వ్యాక్సిన్ కు క్లినికల్ ట్రయల్స్ కు క్లియరెన్సు ఇవ్వనున్నట్లు చెప్పారు. జెనోవా కంపెనీ.. భారత ప్రభుత్వం సంయుక్తంగా టీకాను డెవలప్ చేస్తున్నట్లు చెప్పారు. ఫైజర్ కంపెనీ అనుసరించిన సాంకేతికతను తమ తాజా వ్యాక్సిన్ లో తయారుచేస్తున్నట్లు చెప్పారు. ఈ వ్యాక్సిన్ ప్రత్యేకత ఏమంటే.. మామూలు ఫ్రిజ్ లలో కూడా దీన్ని నిల్వ ఉంచుకునే సామర్థ్యం ఉంది.

ఇప్పటివరకు తెర మీదకు వచ్చిన వ్యాక్సిన్ ఏదైనా సరే.. మైనస్ 60 నుంచి 90 ఉష్ణోగ్రతల మధ్యన ఉండాల్సిందే. దీంతో.. ఈ టీకాల సరఫరాకు ప్రత్యేక వాహనాల్ని వినియోగించారు. బ్రిటన్.. అమెరికా లాంటి దేశాల్లో ఇలాంటి అంశాల్ని అమల్లోకి తీసుకురావటం పెద్ద విషయం కాదు. కానీ.. అలాంటి పరిస్థితి మన దేశంలో చాలా తక్కువన్నది మర్చిపోకూడదు.

దేశ వ్యాప్తంగా వ్యాక్సిన్ అందుబాటులోకి తీసుకెళ్లాల్సిన నేపథ్యంలో మామూలు ఫ్రిజ్ లోనూ భద్రపరిచేలా ప్లాన్ చేస్తున్నారు. తాజాగా.. అందుబాటులోకి వస్తున్న వ్యాక్సిన్ రోటీన్ కు భిన్నంగా రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ విధానం విజయవంతమైతే.. మిగిలిన దేశాలన్నింటికి ఇదో పెద్ద ఊరట అవుతుందని చెప్పక తప్పదు.
Tags:    

Similar News