చంద్రబాబు అవుటైన బ్యాట్స్ మెన్
కొన్ని సార్లు అవుటైన బ్యాట్స్ మెన్ లు అంపైర్లను తిట్టినట్లు తన భవిష్యత్తు అర్థమైపోయిన చంద్రబాబు పదేపదే తనను తిడుతూ టీడీపీ ఓటమిని ఈవీఎంలపై నెట్టే ప్రయత్నం చేస్తున్నారని ప్రధాని మోడీ ఈరోజు వ్యాఖ్యానించారు. ఎన్నికల సంఘాన్ని అంపయిర్లతో పోలుస్తూ చంద్రబాబుపై మోడీ కౌంటర్లు వేశారు. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి తనను విమర్శించడమే చంద్రబాబు ప్రధానమైన పనిగా పెట్టుకున్నారని అన్నారు. ‘‘ఆయనకు ఇపుడు సీన్ అర్థమైంది. ఓటమి తప్పదని తెలుసుకున్నారు. అందుకే ఓటమికి ఈవీఎంను కారణంగా చూపే ప్రయత్నం చేస్తున్నారు’’ అని మోడీ ఆరోపణలు చేశారు.
ఏపీలో ఎన్నికల సమయంలో రెండు సార్లు ప్రచారానికి వచ్చిన మోడీ చంద్రబాబు కుమారుడు లోకేష్ లక్ష్యంగా చేసుకుని చంద్రబాబును విమర్శించారు. సన్ రైజ్ అంటే తన కొడుకు లోకేష్ ను సీఎం చేసే మిషన్ అని తన దైన శైలిలో అప్పట్లో మోడీ వ్యాఖ్యలు చేశారు. ఆ మీటింగ్ తర్వాత ఉత్తరాదిలో బాబును ఎక్కడా విమర్శించలేదు. చాలా గ్యాప్ తర్వాత ఇప్పుడే తిరిగి చంద్రబాబుకు మోదీ కౌంటర్ ఇచ్చారు. అయితే, ఇపుడు మోడీ విమర్శలు చేయడానికి ఓ కారణం ఉంది. నిన్న చంద్ర బాబు బెంగాల్లో ప్రచారం చేస్తూ మోడీని విమర్శించారు. కలకత్తా ఖాళీ వంటి మమత ముందు వంద మంది మోడీలు కూడా సరితూగలేరు అని వ్యాఖ్యానించారు. మోడీని విఫల ప్రధానిగా చిత్రీకరించారు. ఈ నేపథ్యంలో చంద్రబాబుపై మోదీ కౌంటర్లు వేశారు.