నాలుగు గోడల మధ్య విద్యకు బ్రేక్..ఓరల్ రీడింగ్ ఫ్లూయెన్సీ..!
జాతీయ నూతన విద్యావిధానం కింద ఎర్లీ ఛైల్డ్ హుడ్ కేర్ విద్యావిధానాన్ని తాము అమలు చేయబోతున్నామని ప్రధాని మోడీ అన్నారు. ప్రైవేటు స్కూళ్లకు మాత్రమే పరిమితమైన ప్రీ స్కూల్ విద్యను దేశం నలుమూలల గ్రామాలకు చేర వేస్తున్నామని చెప్పారు. జాతీయ విద్యావిధానం ద్వారా ఫౌండేషన్ కోర్సులకు ప్రాధాన్యత ఇస్తామని చెప్పారు. లెర్న్ టు రీడ్, రీడ్ టు లెర్న్ అనే లక్ష్యంగా తాము ఈ విధానాన్ని అమలు చేస్తామని తెలిపారు. ప్రతి విద్యార్థి కూడా మూడో తరగతి చదువును పూర్తి చేసుకునే ప్రతి విద్యార్థీ.. ఓరల్ రీడింగ్ ఫ్లూయెన్సీని అభ్యసించేలా చేస్తామని, సిలబస్ తగ్గిస్తున్నామని అన్నారు.
అలాంటి విద్యార్థి.. భవిష్యత్తులో పాఠ్యాంశాలను త్వరితగతిన అభ్యసించగలరని చెప్పారు. శుక్రవారం ఉదయం ఆయన జాతీయ విద్యావిధానంపై జాతిని ఉద్దేశించి మాట్లాడారు. బేసిక్ గణితాన్ని నేర్పించడానికి ప్రాధాన్యత ఇస్తామనీ అన్నారు. నాలుగు గోడల మధ్య విద్యాను అభ్యసించే విధానానికి కాలం చెల్లిందని మోడీ చెప్పారు. నాలుగు గోడల నుంచి బయటికి వచ్చి, బాహ్య ప్రపంచంలో చదువుకునేలా ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు. దీనికి ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్ బాల్యాన్ని నరేంద్ర మోడీ ఈ సందర్భంగా ప్రస్తావించారు.
జపాన్ లో షిన్రిన్ యోకో అనే విధానాన్ని అనుసరిస్తున్నారని, అడవులు, పర్యావరణం మధ్య జపాన్ లో విద్యార్థులకు చదువును బోధిస్తున్నారని మోడీ చెప్పారు. దీనివల్ల పిల్లల్లో బాల్యం నుంచే పర్యావరణం పట్ల మక్కువ పెరుగుతుందని, పిల్లల్లో సృజనాత్మకత మెరుగుపడుతుందని, ప్రకృతి ఒకరకమైన అనుబంధం ఏర్పడుతుందని ప్రధాని తెలిపారు. తరగతి గదిలో రైలింజన్ గురించి బోధించడం కంటే.. పక్కనే ఉన్న రైల్వే స్టేషన్ కు వెళ్లి దాని గురించి ప్రాక్టికల్ గా అద్భుత ఫలితాలు ఇస్తుందని, దీన్ని తాను బలంగా విశ్వసిస్తున్నానని మోడీ చెప్పారు. చాలామంది ఉపాధ్యాయులు పిల్లల్లోని సృజనాత్మకతను వెలికి తీయడానికి కృషి చేస్తున్నారని, అన్ని చోట్లా అలా ఉండట్లేదని అన్నారు. ప్రాక్టికల్ నాలెడ్జికి విద్యార్థులు దూరమౌతున్నారని, ఆ కొరతను తీర్చబోతున్నామని చెప్పారు.