సొంత మేన‌త్త‌కు న్యాయం చేయ‌ని మోడీ స‌ర్కార్‌?

Update: 2018-06-25 04:53 GMT
అత్యున్న‌త స్థానాల్లో ఉన్న రాజ‌కీయ నాయ‌కుల హ‌వా ఎంత‌లా న‌డుస్తుందో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. స‌ద‌రు నేత కుటుంబ స‌భ్యులే కాదు.. వారి బంధువులు సైత త‌మ హ‌వాను ప్రశంసిస్తుంటారు. ఇందుకు భిన్న‌మైన సీన్ ప్ర‌ధాని మోడీ విష‌యంలో క‌నిపిస్తుంటుంది. దేశ ప్ర‌ధానిగా మోడీ ఉన్న‌ప్ప‌టికీ.. ఆయ‌న కుటుంబ స‌భ్యులంతా మాత్రం సాదాసీదాగా ఉంటారే త‌ప్పించి.. అన‌వ‌స‌ర వార్త‌ల్లో అస్స‌లు క‌నిపించ‌రు.

త‌న కుటుంబ స‌భ్యుల్ని.. బంధువుల్ని ద‌గ్గ‌ర‌కు రానివ్వ‌కుండా జాగ్ర‌త్త‌లు తీసుకునే మోడీని ప‌లువురు ప్ర‌శంస్తుంటారు. అయితే.. తాజా ఉదంతం విన్న వారంతా మోడీని త‌ప్పు ప‌ట్టే ప‌రిస్థితి. అధికారానికి కేంద్రం మోడీ ఉన్న‌ప్ప‌టికి ఆయ‌న సొంత మేన‌త్త‌కు న్యాయం జ‌ర‌గ‌ని వైనం వింటే విస్మ‌యానికి గురి కాక త‌ప్ప‌దు. 90 ఏళ్ల ముదిమి వ‌య‌సులో ప్ర‌భుత్వం త‌న‌కు న్యాయం చేయాలంటూ చేస్తున్న పోరాటం చూస్తే.. మోడీ ఎంత గొప్పోడో ఇట్టే అర్థ‌మవుతుంది.

యావ‌త్ దేశాన్ని మార్చేస్తాన‌ని చెప్పే మోడీ.. సొంత మేన‌త్త‌కు ఏళ్ల‌కు ఏళ్లుగా జ‌రుగుతున్న అన్యాయాన్ని స‌రిదిద్ద‌లేక‌పోవ‌టం చూస్తే.. అయినోళ్ల‌కే ఏమీ చేయ‌ని ఆయ‌న‌.. బ‌యటోళ్ల‌కు ఏమైనా చేస్తారా? అన్న సందేహం రాక మాన‌దు. మోడీ మేన‌త్త దాహీబెన్ న‌రోత్తందాస్ మోడీ. ఆమెకు 90 ఏళ్లు. ఆమెకు చెందిన సొంత భ‌వ‌నాన్ని ఓ ప్ర‌భుత్వ సంస్థ‌కు లీజుకు ఇచ్చారు. ఈ సంస్థ ఆధ్వ‌ర్యంలో మెడిక‌ల్ షాపు న‌డిపిస్తున్నారు.

నిబంధ‌న‌ల ప్ర‌కారం ప్ర‌తి ఐదేళ్ల‌కు అద్దెను మారుస్తూ ఉండాలి. కానీ.. 1998 నుంచి స‌ద‌రు సంస్థ అద్దెను రెన్యువ‌ల్ చేయ‌టం లేదు. రూల్స్ ప్ర‌కారం జ‌ర‌గ‌టం లేదంటూ ఆమె కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ‌కు కంప్లైంట్ చేశారు. అక్క‌డా న్యాయం జ‌ర‌గ‌క‌పోవ‌టంతో గ‌త డిసెంబ‌రులో కేంద్ర స‌మాచార క‌మిష‌న‌ర్ ను ఆశ్ర‌యించారు. ప్ర‌భుత్వ సంస్థ‌లు తీసుకునే భ‌వ‌నాల‌కు అద్దె నిర్ణ‌యానికి సంబంధించిన నిబంద‌న‌లు ఏం ఉన్నాయో తెల‌పాలంటూ ఆమె ద‌ర‌ఖాస్తు చేసుకున్నారు.

1983లో మెడిక‌ల్ షాపు న‌డిపేందుకు బీడీ కార్మికుల సంక్షేమ నిధి సంస్థ‌కు త‌న భ‌వ‌నాన్ని నెల‌కు రూ.600 అద్దె చెల్లించే ఒప్పందం మీద ఇచ్చారు. మ‌ధ్య‌లో లీజు పెంచారు. దీంతో 1998 నాటికి అద్దెరూ.1500 అయ్యింది. అప్ప‌టి నుంచి ఇప్ప‌టివ‌ర‌కూ అద్దె పెంచ‌క‌పోవ‌టంపై ఆమె పోరాడుతున్నారు. సుదీర్ఘ కాలం మోడీ గుజ‌రాత్ ముఖ్య‌మంత్రిగా వ్య‌వ‌హ‌రించ‌టం.. నాలుగేళ్లుగా ప్ర‌ధాని స్థానంలో ఉన్న‌ప్ప‌టికీ.. ఆయ‌న సొంత మేన‌త్త‌కు న్యాయ‌మైన అంశంపై న్యాయం జ‌ర‌గ‌క‌పోవ‌టం దేనికి నిద‌ర్శ‌నం. మోడీ హ‌యాంలో వ్య‌వ‌స్థ‌ల‌న్నీ అటోమేటిక్ గా మంచిగా మారిపోయిన‌ట్లు చెప్పే తీరుకు భిన్నంగా ఉన్న ఈ ఘ‌ట‌న ఇప్పుడు ప‌లువురి దృష్టిని ఆక‌ర్షిస్తోంది. మాట‌లు చెప్ప‌టం స‌రే.. సొంతోళ్ల న్యాయ‌మైన స‌మ‌స్య‌ల‌పైనా ప్ర‌ధాని మోడీ దృష్టి సారిస్తే మంచిదేమో?
Tags:    

Similar News