వామ్మో.. ఈ క‌వ‌రింగ్ మాయ ఏంది మోడీ?

Update: 2018-09-11 05:16 GMT
చాలా చిన్న ప్ర‌శ్న‌. దీనికి చ‌దువు అస్స‌లు అవ‌స‌రం లేదు. 56 పెద్ద‌దా?  72 పెద్ద‌దా? ఊహ తెలిసిన పిల్లాడు మొద‌లు ఎవ‌రైనా స‌రే 72 పెద్ద‌ద‌ని చెబుతారు. కానీ.. మోడీ బ్యాచ్ మాత్రం అందుకు భిన్నంగా వ్య‌వ‌హ‌రిస్తూ ప్ర‌జ‌ల చెవుల్లో ప‌న‌స‌కాయ‌లు పెట్టే ప్ర‌య‌త్నం చేస్తోంది.

పువ్వులు పెట్టుడు పాత‌దైపోయిన వేళ‌.. అందుకు భిన్నంగా గుమ్మ‌డికాయ‌లు పెట్టే ధోర‌ణి పెరిగింది. ఇప్పుడు త‌న అబ‌ద్ధాల‌తో.. అస‌త్యాల‌తో ప‌న‌స‌కాయులు పెట్టే ప్ర‌య‌త్నంలో అడ్డంగా బుక్ అయిపోయింది. తాజాగా చుక్క‌లు చూపిస్తున్న పెట్రోల్‌.. డీజిల్ ధ‌ర‌ల పెంపు నేప‌థ్యంలో దేశ వ్యాప్తంగాపెద్ద ఎత్తున ఆందోళ‌న‌లు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఇందుకు నిర‌స‌న‌గా తాజాగా భార‌త్ బంద్ జ‌రిగింది.

రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ బంద్ అంతంత మాత్రంగా జ‌ర‌గ్గా.. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో మాత్రం సీరియ‌స్ గా సాగింది. పెట్రోల్.. డీజిల్ పెంపుపై విప‌క్షాలు స‌మ‌ర శంఖం పూరించిన వెంట‌నే.. మోడీ డిజిట‌ల్ బ్యాచ్ రంగంలోకి దిగింది.  గ్రాఫిక్స్ మాయాజాలాన్ని ప్ర‌ద‌ర్శించాల‌ని ప్ర‌య‌త్నించి. అడ్డంగా బుక్ అయి న‌వ్వుల‌పాలైన వైనం ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారింది.

తాజాగా బీజేపీ త‌న ట్విట్ట‌ర్ ఖాతాలో రెండు గ్రాఫ్ ల‌ను పోస్ట్ చేసింది. అందులో ఢిల్లీలో 2014 నాటికి పెట్రోల్ ధ‌ర‌లు రూ.71.41 ఉండ‌గా.. ఇప్పుడు రూ.80.73 ఉన్న‌ట్లుగా పేర్కొంది. అదే స‌మ‌యంలో డీజిల్ ధ‌ర‌లు 2014లో రూ.56.71 ఉండ‌గా.. 2018 నాటికి రూ.72.83 ఉన్న‌ట్లు చూపించింది.

అంకెలు ఇలా ఉంటే.. గ్రాఫ్ లో మాత్రం రూ.56.71 పెద్ద‌ద‌న్న‌ట్లుగా పేర్కొన‌టం విశేషం. అంతేకాదు.. ఈ గ్రాఫ్ లో 2004 నుంచి ధ‌ర‌ల పెరిగిన వైనాన్ని చూపిస్తూ.. తాము ధ‌ర‌ల్ని అస్సలు పెంచ‌లేద‌న్న‌ట్లుగా గ్రాఫిక్స్ తో మాయాజాలాన్ని ప్ర‌ద‌ర్శించ‌టాన్ని ప‌లువురు త‌ప్పు ప‌డుతున్నారు. ప్ర‌జ‌ల‌కు బాగా తెలిసి.. అవ‌గాహ‌న పూర్తిగా ఉండి.. నిత్యం జేబుల్లోని  ప‌ర్సుల‌పై భారం పడుతున్న పెట్రో ఉత్ప‌త్తుల‌పైనే గ్రాఫుల‌తో ప్ర‌జ‌ల్ని త‌ప్పుదారి ప‌ట్టిస్తున్న వైనంపై సోష‌ల్ మీడియాలో ఎట‌కారం వ్య‌క్త‌మ‌వుతోంది. మ‌రీ.. ఇంత మాయ చేసుడేంది మోడీ సాబ్ అన్న ఆగ్రహాన్ని ప‌లువురు ప్ర‌ద‌ర్శిస్తున్నారు.
Tags:    

Similar News