మోడీ 'మసాలా' మాట మర్మమేందో తెలుసా?
మోడీ అంటే మామూలోడు కాదు. సిన్నప్పుడు రైల్వేస్టేషన్ లో టీలు అమ్ముకున్నోడు. డక్కామొక్కీలు తిని ముఖ్యమంత్రి పదవిని చేపట్టి.. ఏకంగా ప్రధానమంత్రిగా మారినోడు. ఈ క్రమంలో ఎంతమందిని చూసి ఉంటాడు. ఎప్పుడెలా వ్యవహరించాలి? దేనికి ఎలా రియాక్ట్ కావాలి? అన్నది మోడీకి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. అంతేనా.. అన్నింటికంటే ముఖ్యమైంది మీడియాను వాడేసినంత బాగా మరెవరూ వాడలేరు కూడా.
వాళ్లు.. వీళ్లు అన్న తేడా లేకుండా తనను పొగిడేసేందుకు దేశ వ్యాప్తంగా ఉన్న మీడియా సంస్థల్ని క్యూ కట్టేలా చేయటంలో మోడీ మొనగాడనే చెప్పాలి. మోడీలో ప్రత్యేకత ఏమిటంటే.. తన లోపలి ఆలోచనల్ని బయటోళ్లకు అర్థమయ్యేలా అస్సలు మాట్లాడరు. నిలువెత్తు మార్గదర్శకుడిగా ఆయన నోట మాటలు అలవోకగా వస్తాయి. వ్యక్తిత్వ వికాస నిపుణుడిగా మాటలు చెప్పే పెద్ద మనిషి మనసులో అసలేముందన్నది చాలామందికి ఒక పట్టాన కొరుకుడు పడడు.
మీ ఉత్సాహాం వెనుక రహస్యమేందన్న ప్రశ్నకు ఏదేదో చెప్పకుండా.. నా ప్రత్యర్థులు రోజు కిలోల కొద్దీ తిట్టు పెడుతుంటారు. అదే నా ఉత్సాహం అంటూ విదేశీ గడ్డ మీద ఇచ్చిన పంచ్ స్వదేశంలో ఎంతోమంది మీద పడింది. అదీ మోడీ అంటే. అలా ఉంటాయి ఆయన మాటలు. అలాంటి పెద్ద మనిషి సొంత పార్టీ నేతల మీద ఇరిటేట్ అయ్యారు. ఎంతకూ నా మాట వినరేం.. కోరి మరీ కష్టాలు తెచ్చుకుంటారే? అన్న రీతిలో క్లాస్ పీకిన వైనం తాజాగా చోటు చేసుకుంది.
పార్టీ నేతలు కొందరితో తన మొబైల్ యాప్ ద్వారా మాట్లాడారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడటం ఎలా? అన్న విషయాన్ని తనదైన శైలిలో విశ్లేషించారు. మీడియాతో మాట్లాడటం ద్వారా.. వివాదాల్ని మనమే వారి దృష్టికి తీసుకెళుతున్నామని.. మీడియాకు మసాలా మనమే ఇస్తున్నామంటూ చెప్పారు. నోటికి వచ్చింది మీడియా ముందు మాట్లాడొద్దన్న మోడీ.. బాధ్యతారాహిత్యంగా మాట్లాడి మనల్ని విమర్శించేలా మీడియాకు మనమే అవకాశం ఇస్తామన్నారు.
నిత్యం ఏదో ఒక వివాదంలో చిక్కుకొని చివరకు పార్టీకే కాదు.. తమకు తాము చెడ్డపేరు తెచ్చుకుంటారన్నారు. ఈ విషయంలో మీడియాది తప్పు లేదని.. అదేం చేయాలో అది చేస్తుందన్న మోడీ.. కెమేరా ముందు నిలబడి ప్రతి విషయంలోకి దూరి.. దేశానికి మార్గదర్శనం చేయాల్సిన అవసరం లేదని.. మాట్లాడాల్సిన బాధ్యత ఉన్న వారే మీడియాతో మాట్లాడతారంటూ ఓ రేంజ్లో క్లాస్ పీకారు.
మనం చేసే తప్పులతో మనకు మనమే మీడియాకు వివాదాల్ని అందిస్తున్నామని ఎప్పుడైనా ఆలోచించారా? అంటూ ప్రశ్నించిన మోడీ.. కెమేరా పట్టుకొన్న వ్యక్తిని చూడగానే మనమేదో దేశంలోని ప్రతి సమస్యనూ విశ్లేషించగలిగే శాస్త్రవేత్తలమో.. పరిశోధకులమో అన్నట్లుగా ఫీల్ అయిపోతామని.. కానీ మనం మాట్లాడినదాంట్లో మీడియా వాళ్లకు ఏం అవసరమో అదే తీసుకుంటారన్నారు. మరింతగా క్లాస్ పీకిన మోడీ మాష్టారు పార్టీ నేతలకు ఏం చెప్పాలనుకుంటున్నారంటారా? సింఫుల్.. కాస్త నోరు మూసుకొని ఎవరి పని వారు చేయండి.. పార్టీకి స్పోక్ పర్సన్స్ ఉంటారు కదా.. మీడియాతో ఏం మాట్లాడాలి.. ఎలా మాట్లాడాలన్నది వారు చూసుకుంటారన్నట్లుగా మోడీ సందేశమిచ్చారు. మోడీ మనసులోని మాటను బయటపెట్టి.. మసాలా మాటను చెప్పారంటే పార్టీ నేతల తీరు ఆయన్ను ఎంతగా ఇరిటేట్ చేసిందో ఇట్టే అర్థమవుతంది. మసాలా పేరుతో ఇచ్చిన సందేశం పార్టీ నేతలకు ఎంతగా అర్థమైందన్నది కమలనాథుల తీరు చెప్పకమానదు.