ఇలాంటి కామెడీ చేయడం లోకేష్ కే సాధ్యం
ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తనయుడు, మంత్రి నారా లోకేష్ పై మరోమారు సోషల్ మీడియాలో చెణుకులు పేలుతున్నాయి. అవగాహన రాహిత్యమో..లేదా అత్యుత్సాహమో తెలియదు కానీ...మంత్రి లోకేష్ చర్యలు కామెడీకి మారుపేరుగా అయ్యాయని అంటున్నారు. గతంలో జరిగిన పలు ఉదంతాలను పేర్కొంటూ తాజాగా ఆయన చేసిన పనిపై పంచ్ లు వేస్తున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీని టార్గెట్ చేసేందుకు ఆయన చేసిన పని ఇలా హాస్యాస్పదం కావడం గమనార్హం.
గతంలో తమ పార్టీ గురించి - ఆఖరికి తనపై తానే మంత్రి లోకేష్ పరోక్షంగా సెటైర్లు వేసుకున్న ఉదంతం సోషల్ మీడియాలో వైరల్ అయింది. తెలుగుదేశం ప్రత్యర్థులకు అస్త్రం అయింది. కాబోయే ముఖ్యమంత్రి పరిజ్ఞానం ఇదేనా అంటూ కొందరు పంచ్ లు వేశారు. అయితే, ఈ ప్రహసనాల పర్వం ఓ వైపు కొనసాగుతుండగానే...మరోవైపు తాజాగా మంత్రి లోకేష్ మళ్లీ నెటిజన్లకు దొరికిపోయారు. ప్రత్యేక హోదా విషయంలో ఆయన వేసిన స్టెప్ బూమరాంగ్ అయింది. ఏపీకి ప్రత్యేక హోదా కోసం మొదటి నుంచి ప్రధాన ప్రతిపక్షమైన వైసీపీ ఉద్యమిస్తున్న సంగతి తెలిసిందే. హోదా పోరును ఎగతాళి చేసిన టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు సహా ఆ పార్టీ నేతలు... అన్నివర్గాల ప్రజలు ఉద్యమిస్తున్న నేపథ్యంలో తనకు డ్యామేజ్ అవుతుందని గ్రహించి అదే నినాదాన్ని ఎత్తుకున్నారు.
ఈ పర్వంలో భాగంగా టీడీపీ యువనేత అయిన మంత్రి లోకేష్ ప్రధానమంత్రికి ఓ పోస్ట్ కార్డ్ రాశారు. అయితే ఈ ఉత్తరంతోనే లోకేష్ బుక్ అయ్యారని అంటున్నారు. ఎందుకంటే ఇందులో సెక్రటేరియట్ స్పెల్లింగ్ ను తప్పుగా రాశారు. Secretariat అనేది సెక్రటేరియట్ కు కరెక్ట్ స్పెల్లింగ్. లోకేష్ మాత్రం secreteriat అని రాశాడు. ఇక నవ్యాంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని సైతం తప్పుగా రాశారు. అమరావతిని ఆంగ్లంలో రాసినప్పుడు ‘H’ ఉండదు. అయితే లోకేష్ దాన్ని యాడ్ చేశాడు. మంత్రి హోదాలో ఉన్న వ్యక్తి సెక్రటేరియట్ స్పెల్లింగ్ తప్పుగా రాయడమే చిత్రం అనుకుంటే...దాన్ని మించి పోయేలా తమ రాజధాని పేరును సైతం సరిగా రాయలేకపోయాడని పలువురు నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు.