లోకేష్ 'పొత్తు' లో కాలేశారు
పాపం. చినబాబుకు ఏదీ కలిసి రావడం లేదు. అలాగని మాట్లాడకుండా ఉంటారా అంటే అదీ లేదు. ఏదో ఒకటి మాట్లాడేసి ఆనక ఆయన నాలికే కాదు... తండ్రి - ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా నాలిక కరుచుకునేలా చేస్తున్నారు. ఇప్పుడు ఏకంగా తెలంగాణ తెలుగుదేశం పార్టీ నాయకులే రక్తాలు కారేలా నాలుకలు కరుచుకునే స్థితి తీసుకువస్తున్నారు చినబాబు నారా లోకేష్. ఇంతకీ విషయం ఏమిటంటే.... తెలంగాణలో కాంగ్రెస్ పార్టీతో కలిపి పొత్తు కుదుర్చుకుని పోటీ చేయాలని చంద్రబాబు నాయుడి ఎత్తుగడ. దీని వల్ల అటు తెలంగాణలోనూ - ఇటు జాతీయ స్ధాయిలోనూ ప్రభుత్వాలకు వ్యతిరేకంగా మూడో శక్తి వస్తోందని చెప్పడం చంద్రబాబు నాయుడి ఉద్యేశ్యం. దీనిని దృష్టి లో ఉంచుకునే చంద్రబాబు నాయుడు పొత్తులపై ఎవరినీ ఏమీ మాట్లాడవద్దని హెచ్చరిస్తున్నారు. తెలంగాణ నాయకులు కూడా ఇదే ఫార్ములాని పాటిస్తున్నారు. అయితే, ఇవన్నీ పట్టించుకోని తెలుగుదేశం యువ నాయకుడు - ఆంధ్రప్రదశ్ ఐటీ శాఖా మంత్రి నారా లోకేష్ మాత్రం తెలంగాణలో అన్ని స్థానాల్లోనూ పోటీ చేస్తామని ప్రకటించేశారు.
ముందువెనుకా ఆలోచించకుండా ఇలాంటి ప్రకటనలు చేయడం వల్ల అటు కాంగ్రెస్ లోనూ - ఇటు తెలుగుదేశం పార్టీలోనూ కూడా కొందరు నాయకులు కినుక వహించే అవకాశాలున్నాయంటున్నారు. ఎన్నికలకు ముందు పలువురు నాయకులు టిక్కట్లు ఆశించడం సహజం. ఎప్పటి నుంచో పార్టీని నమ్ముకున్న వారైతే సరేసరి. అలాంటి వారికి చినబాబు ప్రకటన ఆశలు రెకెత్తిస్తుంది. తీరా ఎన్నికల సమయంలో వారికి టిక్కట్లు రాకుండా పొత్తులో ఆ స్దానం పోయిందంటే వారంతా పార్టీకి వ్యతిరేకంగా పని చేసే అవకాశం ఉంది. అలాగే కాంగ్రెస్ పార్టీ కూడా మనతో పొత్తు అని తండ్రి మాట్లాడుతూంటే అన్ని స్ధానాల్లోనూ పోటీ అంటూ కుమారరత్నం ప్రకటించడం ఏమిటీ అంటూ దీర్ఘాలు తీసే అవకాశమూ ఉంది. ఇది రెండు పార్టీల మధ్య కనిపించని చిచ్చు రగిల్చే అవకాశం ఉందంటున్నారు రాజకీయ పరిశీలకులు. ఇదంతా ఎందుకు... ఎన్నికల తేదీ ప్రకటించే వరకూ చినబాబు ఏమి మాట్లాడకుండా ఉంటే తెలుగుదేశం పార్టీకి - ఇటు కాంగ్రెస్ పార్టీకి కూడా మంచిదని వారంటున్నారు. ఆలు లేదు... చూలు లేదు... ఎలాంటి పొత్తు లేదంటూ చినబాబు చేస్తున్న ప్రకటనలతో తెలుగుదేశం పార్టీకి ఇబ్బందులు తప్పవని వారంటున్నారు.