'చినబాబు' కు తొందర ఎక్కువ!
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు - ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు తనయుడు - ఐటి శాఖ మంత్రి నారా లోకేష్ కి కోపం వచ్చింది. ఆయన ఏం మాట్లాడుతున్నారో తెలియనంతగా ఊగిపోతున్నారు. దీనికి తార్కానమే గుంటూరులో జరిగిన తెలుగుదేశం పార్టీ హమారా టీడీపీ బహిరంగా సభలో లోకేష్ జనసేనాని పవన్ కల్యాణ్ పైన - వైఎస్ ఆర్ సీపీ అధ్యక్షుడు వై.ఎస్. జగన్ మోహన రెడ్డి పైన చినబాబు ఆగ్రహించారు. తాను చెడ్డిలు వేసుకోవడానికి ముందే తన తాత ముఖ్యమంత్రి అయ్యారని - చెడ్డీలు వేసుకున్నాక తన తండ్రి నారా చంద్రబాబు నాయడు ముఖ్యమంత్రి అయ్యారని ప్రకటించారు. తన కుటుంబంలో అవినీతి అనేది తాను చెడ్డీలు వేసుకోక ముందే తన కుటుంబంలో వినపడలేదని - ఇప్పుడు పవన్ కల్యాణ్ తనపై అవినీతి ఆరోపణలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. తాము ఏంచేస్తున్నామో తెలియని - చేసిన తర్వాత వచ్చే పరిణమాలను వూహించని చెడ్డి గ్యాంగ్ లాగే చినబాబు లోకేష్ మాట్టాడుతున్నారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. తనకు ఏమి తెలియని పసివయస్సులో జరిగిన విషయాలను చినబాబు లోకేష్ ప్రకటించడం హాస్యాస్పదంగా ఉందని విశ్లేషకులు అంటున్నారు.
తెలుగుదేశం చేస్తున్న అవినీతిపై ఆధారాలతో రావాలని చినబాబు లోకేష్ ప్రతిపక్ష నేత జగన్ మోహన రెడ్డికి సవాల్ విసిరారు. పనిలో పనిగా ఇటీవల తరచుగా తనపై విమర్శలు గుప్పిస్తున్న పవన్ కల్యాణ్ ను కూడా నిరూపించమంటున్నారు. ఇది చినబాబు లోకేష్ అమాయకత్వానికి పరాకాష్టగా రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అవినీతికి పాల్పడేవారెవరైన సాక్షాలు - ఆధారాలతో దొరికిపోతారా అని రాజకీయ పరిశీలకులు ప్రశ్నిస్తున్నారు. తన తండ్రి - ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా తన రాజకీయ జీవితంలో ఆధారాలు చూపండీ అంటూ ఎప్పుడూ మాట్లాడలేదని - రాజకీయ నాయకుల అవినీతికి ఆధారాలు ఉండవని ఆయనకు తెలిసినంతగా లోకేష్ కు తెలియదని వారంటున్నారు. చినబాబు లోకేష్ కు ఎలాంటి సమాచారం లేకపోవడంతో చీకట్లో బాణాలు వదులుతున్నారని రాజకీయ విశ్లేషకుల అంచన. ఎన్నికల ముందు చినబాబు లోకేష్ ఎంత ఎక్కువగా మాట్లాడితే, ఎన్ని ఎక్కువ ఆరోపణలు చేస్తే ప్రతిపక్ష నేత జగన్ మోహన రెడ్డికి అంత కలసి వస్తుందని వారంటున్నారు. నిజానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ప్రతిపక్షం శాసనసభలో కంటే సొంత ఇంట్లోనే లోకేష్ రూపంలో ఉందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు.