ఆంధ్రాలో ఉన్నవి రెండే పార్టీలన్న నాగబాబు
మెగా బ్రదర్ నాగబాబు ‘ఫైర్ ఈజ్ ఫైర్.. ఐయామ్ ది ఫైర్’ అన్నట్టుగా వరుస సంచలన వ్యాఖ్యలతో నిప్పులు చెరుగుతూనే ఉన్నారు. కాచుకోవడమే ప్రతిపక్షాలకు, మీడియాకు పని అయిపోయింది.
తాజాగా మరో హాట్ కామెంట్స్ తో నాగబాబు వార్తల్లో నిలిచారు. ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ - జనసేన రెండే పార్టీలు ఉన్నాయని.. తెలుగుదేశం పార్టీ అనేది ముగిసిన అంకం అని జనసేన నేత నాగబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఓ చానెల్ తో మాట్లాడిన నాగబాబు ఈ మేరకు టీడీపీని లైట్ తీసుకున్నారు.
2024 ఎన్నికల్లో వైసీపీకి, బీజేపీ-జనసేన కూటమి మధ్యనే పోటీ ఉంటుందని నాగబాబు అన్నారు. తెలుగు దేశం పార్టీ విపరీతమైన అవినీతి చేయడం వల్లనే ప్రజలు పక్కనపెట్టారని.. ఇక ఆ పార్టీ వ్యవహారం ముగిసినట్టేనని నాగబాబు అన్నారు. 2024లో జనసేన అధికారంలోకి వస్తుందని.. పవన్ సీఎం అవుతారని తాను ప్రగాఢంగా విశ్వసిస్తున్నట్టు ఆయన అన్నారు.
జనసేనలో నాదెండ్ల మనోహర్ ప్రమేయం పెరిగిపోతుందన్న మాట తప్పు అని.. పార్టీ నేత పవనే ఆయనను నియమించారని నాగబాబు వివరణ ఇచ్చారు. తన మద్దతు నాదెండ్ల మనోహర్ కే ఉంటుందన్నారు.
తన అన్నయ్య మెగాస్టార్ కు రాజకీయాలపై ఇంట్రస్ట్ లేదని.. అందుకే ఆయన మళ్లీ సినిమాలకు, ఇండస్ట్రీకి అంకితమయ్యాడని నాగబాబు తెలిపారు. ఆయన ఏపార్టీలోకి వెళ్లడని.. అలాంటి పరిస్థితి వస్తే జనసేనలోకే వస్తారని నాగబాబు ఆశాభావం వ్యక్తం చేశారు.